Chandrababu Naidu: “హిందువులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి” అంటూ #CBNShouldApologizeHindus అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఈ హ్యాష్‌ట్యాగ్ వాడుతున్నవారు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Social Media Calls for Chandrababu Naidu to Apologize to Hindus

తిరుపతి లడ్డు లో ఎలాంటి కల్తీ లేదని తేలడంతో ట్విట్టర్‌లో #CBNShouldApologizeHindus హ్యాష్‌ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు హిందువులు. ఈ టాగ్ వేగంగా విస్తరించడంతో ఆయన పై ఇప్పుడు వత్తిడి మరింత పెరిగింది. ముఖ్యమంత్రి పదవి ని అడ్డం పెట్టుకుని గతంలో హిందూ ఆలయాలపై దాడి చేయడం, ఇప్పుడు హిందువుల మనోహవాలను దెబ్బతీయడం వంటి వివాదాస్పద ఘటనలే కారణమని విమర్శకులు అంటున్నారు. ఈ ఘటనలు నాటి నుండి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. చంద్రబాబు హిందువులకు అన్యాయం చేశారని, ఆయన చర్యలు హిందూ ధార్మిక సంస్థలపై ప్రతికూల ప్రభావం చూపాయని కొందరు వాదిస్తున్నారు.

Also Read: Green Chilies: పచ్చి మిరపకాయలు విపరీతంగా తింటున్నారా..అయితే ప్రమాదమే ?

హ్యాష్‌ట్యాగ్ ద్వారా చంద్రబాబు హిందూ సంప్రదాయాలను గౌరవించకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ నిర్ణయాలు తీసుకున్నారని అభిప్రాయపడినవారు ఆయనపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్న ఈ విమర్శలు, రాజకీయంగా చంద్రబాబుకు సమస్యలను పెంచేలా కనిపిస్తున్నాయి.

ఇదే సమయంలో, చంద్రబాబు నాయుడు తనపై వచ్చిన ఈ విమర్శలకు అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అయితే, రాజకీయ పరంగా ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో, ఆయన దానికి ఎలా ప్రతిస్పందిస్తారో చూడాల్సి ఉంది.