HYDRA: రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న HYDRAA ప్రాజెక్ట్, తెలంగాణ రాజకీయాల్లో గేమ్-చేంజర్‌గా మారే అవకాశం ఉంది. సామాన్య ప్రజల జీవిత సొమ్ముతో కట్టిన ఇళ్లను కూల్చడం అన్యాయం అనేది బాధితులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి అభిప్రాయంగా మారింది. రాజకీయ విశ్లేషకులు ఈ కూల్చివేతలు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా పెద్ద నష్టాన్ని కలిగిస్తాయని భావిస్తున్నారు.

Will BRS Benefit From the Public Backlash Against HYDRA

ఇటీవల వరకు మౌనంగా ఉన్న BRS ఈ ప్రక్రియ ను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది. KTR బాధితులను కలుసుకుని, వారి సమస్యలు వినడం, ప్రభుత్వంపై వ్యతిరేకతను ప్రేరేపించడంలో ముందుండటాన్ని మనం చూస్తున్నాం. ఈ పరిణామాలు GHMC ఎన్నికల ముందు BRSకి కొత్త ఆశలను అందిస్తున్నాయి.

Also Read: Mahesh Babu: ఎన్టీఆర్ దేవర విడుదలై నాలుగు రోజులవుతున్నా మహేష్ మౌనమెందుకు?

అయితే, ఈ సమస్యపై KCR ఇంకా ఎందుకు స్పందించడం లేదన్నది చాలామందికి ప్రశ్నగా మారింది. BRSలో KCR ప్రదర్శించే ప్రతిఘటన అత్యంత శక్తివంతమైనది. KTR సాఫ్ట్ అయిన నాయకుడిగా కనిపిస్తాడని, కానీ KCR వంటి ప్రజలకు దగ్గరైన నాయకుడే ఈ పరిస్థితిని సానుకూలంగా మార్చగలడని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. KCR ప్రసంగాలు ఈ అంశాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మార్చగల శక్తివంతమైన ఆయుధం. అయినప్పటికీ, KCR ఇంకా తన ఎర్రవెల్లి ఫార్మ్ హౌస్‌లో విశ్రాంతిలోనే ఉన్నారు.

మరోవైపు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సమస్యపై పూర్తిగా మౌనంగా ఉన్నారు. మంత్రి వర్గం మాత్రమే మాట్లాడుతున్నా, వారు కూడా ఒక్కో విధంగా మాట్లాడడం ప్రజల్లో మరింత గందరగోళానికి దారితీస్తోంది. KCR ఈ పరిస్థితిని రాజకీయంగా బాగా వాడుకోవచ్చు, కానీ ఎందుకో ఆయన ఇప్పటికీ మౌనంగా ఉన్నారు.