Congress: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. అయితే ఇటీవల… టిఆర్ఎస్ పార్టీలో గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరు పార్టీ మారిన నేపథ్యంలో కోర్టుకు వెళ్ళింది టీఆర్ఎస్ పార్టీ. దీంతో హైకోర్టు కూడా ఈ అంశంపై చాలా తీవ్రంగా స్పందించింది. ఒక పార్టీ తరఫున గెలిచి మరొక పార్టీలో ఎలా చేరుతారని ముగ్గురు రెబల్ ఎమ్మెల్యేలపై సీరియస్ అయింది హైకోర్టు. Congress

daanam nagendhar resign congress sketch

అంతేకాదు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యేల సభ్యత్వం పై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇంకా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని కూడా ప్రశ్నించింది. నెలరోజుల్లోగా దీనిపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. అయితే 20 రోజులైనా కూడా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరో పది రోజుల్లో కోర్టు గడువు ముగియనుంది. ఇలాంటి నేపథ్యంలో… దానం నాగేందర్ విషయంలో కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయనతో.. రాజీనామా చేయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందట. Congress

Also Read: Chandrababu Naidu: హిందువులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి.. దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్న హ్యాష్ ట్యాగ్!!

ఈ మేరకు దానం నాగేందర్ కు స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చిందట కాంగ్రెస్ పార్టీ. దానం నాగేందర్ తో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ భావిస్తుందట. ఇలాంటి నేపథ్యంలోనే దానం నాగేందర్… కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారట. తాను అసలు రాజీనామా చేయబోనని ప్రకటించారట. 2004లో ఇలాగే రాజీనామా చేస్తే దానం నాగేందర్ ఉప ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు.అందుకే ఇప్పుడు మళ్లీ ఉప ఎన్నికలకు వెళ్లకూడదని దానం నాగేందర్ అనుకుంటున్నారట. మరి దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. Congress