KTR: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బలహీనులను కర్కశంగా వ్యవహరించడం అనవసరమని, వారి పట్ల మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం కేటీఆర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

KTR Honors Mahatma Gandhi and L.B. Shastri, Slams Congress

కేటీఆర్‌ మాట్లాడుతూ, సత్యాగ్రహంతో ప్రపంచాన్ని మేల్కొలిపిన మహాత్మా గాంధీ మన సమాజానికి, నేతలకు స్ఫూర్తినిచ్చిన మహనీయుడు అని అన్నారు. గాంధీజీ స్ఫూర్తితోనే నేతలు ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని సూచించారు. ముఖ్యంగా, నెల్సన్‌ మండేలా వంటి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధులైన నాయకులకు కూడా గాంధీజీ మార్గదర్శకుడిగా నిలిచారనీ, ఆయన సిద్ధాంతాలు నేటికీ మరింత ప్రాధాన్యమున్నవని చెప్పారు.

Also Read: Soundarya: సౌందర్య ఆస్తిని కాజేసిన మోహన్ బాబు.. వాస్తవమెంత?

కేటీఆర్‌ తన ప్రసంగంలో, గాంధీజీ చెప్పినట్లు సమాజంలోని అత్యంత బలహీనులకు ప్రభుత్వం ఎలా సహాయపడుతుందో, దాని ఆధారంగా ఆ ప్రభుత్వ నైతిక విలువలు ప్రతిఫలిస్తాయన్నారు. అయితే, రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ విషయాన్ని మర్చిపోయిందని, వారి పాలనలో పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇండ్ల కూల్చివేతల విషయం ప్రస్తావిస్తూ, డీపీఆర్‌ లేకుండా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టడం అన్యాయమని, ఈ చర్యలను మానవత్వంతో పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.