Devi Sri Prasad: ఏంటి ఇండస్ట్రీలో పేరున్న ఆ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఇంటిముందు చాప వేసుకుని పడుకున్నాడా..ఆయనకు అంత కష్టం ఎందుకు వచ్చింది.. అంత పెద్ద డైరెక్టర్ అయినటువంటి ఆయనకు ఉండడానికి ఇల్లు కూడా లేదా.. ఇంతకీ ఆయన చెప్పిన మాటల్లో ఎంత నిజం ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.
Devi Sri Prasad is the star director who slept on a mat in front of the house
దేవిశ్రీ ప్రసాద్ ఇంటి ముందు చాప వేసుకుని పడుకున్నాడు అంటూ వార్తల్లో ఉన్న డైరెక్టర్ ఎవరో కాదు ఎస్వీ కృష్ణారెడ్డి..అవును మీరు వినేది నిజమే. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్వి కృష్ణారెడ్డి ఎన్నో హిట్ సినిమాలను తెరకెక్కించారు. ఈయన డైరెక్టర్ మాత్రమే కాదు నటుడిగా కూడా కొన్ని సినిమాల్లో చేశారు. (Devi Sri Prasad)
Also Read: Samantha: కేటీఆర్ సమంతల రిలేషన్ నిజమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..?
అయితే అలాంటి ఎస్.వి కృష్ణారెడ్డి,దేవిశ్రీప్రసాద్ ఇంటి ముందు చాప వేసుకొని పడుకోవడానికి కారణం అప్పట్లో దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తికి ఎస్ వి కృష్ణారెడ్డి ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్.. ఈ ఇద్దరు సినిమాల గురించి ఎన్నో ముచ్చట్లు పెట్టుకునే వారట. అంతేకాదు ఎస్వీ కృష్ణారెడ్డి తన నెక్స్ట్ సినిమా గురించి చెబితే స్టోరీ వింటూనే కథ ఊహించుకునే వారట.
అలా తనకు సినిమాల విషయంలో డిఎస్పి తండ్రి సత్యమూర్తి ఎంతగానో సపోర్ట్ చేశారట. అయితే వీరిద్దరికి ఉన్న సాన్నిహిత్యం కారణంతో కొద్ది రోజులు ఎస్వీ కృష్ణారెడ్డి దేవిశ్రీప్రసాద్ ఇంటి ముందే ఉండే అరుగు మీద పడుకొని ప్రొద్దున లేచి చాప మడత పెట్టి అక్కడే పెట్టేసి మళ్ళీ తన సినిమాల కోసం వెళ్లేవారట. అలా వీరిద్దరి మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది అంటూ ఎస్ వి కృష్ణారెడ్డి స్వయంగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.(Devi Sri Prasad)