Devara: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ వద్ద అపూర్వ విజయాన్ని సాధించింది. ఈ విజయాన్ని ఘనంగా జరుపుకోవాలని అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశారు. అయితే, దసరా మరియు దేవీ నవరాత్రుల సందర్బంగా బహిరంగ వేడుకలకు అనుమతులు లభించకపోవడంతో వారి ఆశలు కొంత నీరుగాయాయి.

Government Restrictions Impact Celebrations for Jr. NTR Devara

సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ రద్దయినప్పటికీ, విడుదల తర్వాత ‘దేవర’ భారీ విజయాన్ని సాధించడంతో ఎన్టీఆర్, సక్సెస్ మీట్ నిర్వహించాలని అనుకున్నారు. కానీ, ప్రభుత్వ అనుమతులు రాకపోవడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. చిత్ర నిర్మాత నాగవంశీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.

Also Read: Johnny Master: జానీ మాస్టర్ కి బెయిల్.. కానీ కండిషన్స్.. అసలెందుకు icchinatlu!!

అభిమానుల ఆశలను నిరాశపరచడంపై నాగవంశీ విచారం వ్యక్తం చేస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో బహిరంగ వేడుక నిర్వహించడం సాధ్యం కాదని తెలిపారు. దీనితో పాటు, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తూ, విడుదలైన కొద్ది రోజుల్లో రూ. 396 కోట్లకు పైగా వసూలు చేసింది. ఎన్టీఆర్ అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా జరుపుకుంటున్నా, బహిరంగ వేడుక నిర్వహించలేకపోవడం కొంత నిరాశ కలిగించడమంటూ చెప్పారు.

ఇక సినిమా గురించి ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వస్తోన్నా కలెక్షన్స్ ఆగట్లేవు. కొంతమంది ఈ సినిమాను ఆసక్తిగా చూస్తున్నారు, మరికొందరికి మాత్రం ఈ సినిమా అంతగా ఆకర్షణీయంగా అనిపించడం లేదు. అయినప్పటికీ, సినిమా కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. సినిమా యూనిట్ ప్రస్తుతానికి ప్రమోషన్ పై దృష్టి పెట్టి, కలెక్షన్స్‌ను మరింత పెంచడానికి ప్రయత్నిస్తోంది. ‘దేవర’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతవరకు విజయం సాధిస్తుందో అనేది వేచి చూడాలి.