Indian3: తమిళ చిత్ర పరిశ్రమలో పేరుపొందిన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు భారీ బడ్జెట్ గా చేస్తున్న చిత్రం ఇండియన్3. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో కమల్ హాసన్, సిద్దార్థ్ హీరో లుగా నటిస్తుండగా ఇటీవలే విడుదలైన ఇండియా 2 సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. అందుకేనేమో ఈ ఇండియన్ 3 సినిమా ను నెట్‌ఫ్లిక్స్‌ ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌ ద్వారా నేరుగా విడుదల చేయాలనుకుంటున్నట్లు సమాచారం.

Indian3 Set for a Digital Premiere on Netflix in Early 2025

ఇండియన్ సినిమా అంటే ప్రేక్షకులలో అంచనాలు మరింతగా పెరిగిపోతాయి. తాజా సమాచారం ప్రకారం, 2025 జనవరిలో ఈ సినిమాను నేరుగా ఓటిటి విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొదట థియేటర్లలో విడుదల చేయాలని భావించినప్పటికీ, ఓటిటి ప్లాట్‌ఫార్మ్స్‌లో పెరుగుతున్న ప్రేక్షకాదరణను దృష్టిలో ఉంచుకొని ఈ మార్పు తీసుకురావాలని నిర్ణయించారట.

Also Read: Samantha: కొండా సురేఖ సమంత ఇష్యూలోకి పవన్ కళ్యాణ్.. చెడుగుడు ఆడుతున్న సామ్ ఫ్యాన్స్.?

ఇటీవల కాలంలో అనేక సినిమాలు ఓటిటి ద్వారా విడుదల అవుతున్నాయి, కానీ #ఇండియన్3 లాంటి భారీ బడ్జెట్‌ చిత్రం ఓటిటిలో విడుదల అవుతుందని చెప్పడం ప్రేక్షకులకు కొత్త అనుభవం కావొచ్చు. థియేట్రికల్ రిలీజ్ వున్నా, లేకపోయినా, ఈ సినిమాకు ఉన్న ఫాలోయింగ్‌ను అంచనా వేయడం కష్టం.

ఇంతకు ముందు వచ్చిన ఇండియన్ సిరీస్‌లోని రెండు సినిమాలు బ్లాక్‌ బస్టర్‌ హిట్లుగా నిలిచిన నేపథ్యంలో, అభిమానులు ఈ మూడవ భాగం కూడా అదే స్థాయిలో విజయాన్ని సాధిస్తుందనే ఆశతో ఉన్నారు. సినిమాను ఓటిటి ద్వారా విడుదల చేసినా, ప్రేక్షకుల ఆదరణలో ఎలాంటి మార్పు ఉండదని నిర్మాతలు విశ్వసిస్తున్నారు.అనిరుద్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా లో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.