KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా, ఇంకా ఏ ఒక్క సంక్షేమ లేదా అభివృద్ధి పథకం సక్రమంగా అమలుకి నోచుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ ఎక్కడ చూసినా పరిపాలనా సమస్యలు, అవ్యవస్థలు కనిపిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెట్టుబడులు నిలిచిపోవడంతో, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సైతం తగ్గిపోయాయని కూడా అంటున్నారు. దీనితో పాటు, ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా పడిపోయినట్టు తెలుస్తోంది.

KTR Criticizes Ruling Congress Over Telangana Economic Crisis

ఈ పరిస్థితులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన ట్విట్టర్‌లో, పడిపోతున్న ప్రభుత్వ ఆదాయాలు పరిపాలన వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. అనుభవం లేకపోవడంతో ఈ అనర్థం జరుగుతోందని, సంపద సృష్టించి పేదలకు పంచే తెలివి సీఎం రేవంత్ రెడ్డికి లేకపోవడం వల్లే ఇబ్బందులు ఎదురవుతున్నాయని కేటీఆర్ విమర్శించారు.

Also Read: Manchu Vishnu: అక్కినేని ఫామిలీ కి అభయహస్తం ఇచ్చిన మంచు విష్ణు.. న్యాయం చేస్తాం!!

కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలి ఏడాది నుంచే ఈ స్థాయి దుస్థితి ఉంటే, వచ్చే నాలుగేళ్లలో పరిస్థితులు మరింత దిగజారుతాయని ఆయన హెచ్చరించారు. దిద్దుబాటు చర్యలు తీసుకోవడం కాకుండా, ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న చర్యలు తెలంగాణ రాష్ట్రాన్ని మరింత నష్టపరుస్తాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంతటి సంక్షోభానికి కారణం మార్పు మార్పు అంటూ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీనే అని, ప్రగతి పథంలో ఉన్న తెలంగాణను ఆపేసి పాపం ఆ పార్టీకే వదిలిపెట్టాల్సి వస్తుందని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.