producer shocking comments on Samantha Ktr relation

Samantha: ప్రస్తుతం సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది కొండా సురేఖ అక్కినేని ఫ్యామిలీ పై కేటీఆర్ సమంత లకు ముడి పెడుతూ చేసిన వ్యాఖ్యలే..ఈమె వ్యాఖ్యలపై ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేగింది. దీంతో కొండా సురేఖ పై ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తూ ఫైర్ అవుతున్నారు. అయితే ఇండస్ట్రీ జనాలందరూ అక్కినేని ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటే ఈ నిర్మాత మాత్రం కొండా సురేఖకు మద్దతుగా నిలిచారు.

Producer shocking comments on Samantha Ktr relation

ఇక ఆయన ఎవరో కాదు నిర్మాత నట్టి కుమార్.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ కొండా సురేఖ చాలా సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉంది.ఆమెకి తప్పేంటో ఒప్పేంటో తెలియకుండా ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయదు. ఆమె దగ్గర ఆధారాలు ఉంటే చూపించాలి.ఇక ఒకప్పుడు డ్రగ్స్ కేసులో టాలీవుడ్ లో చాలామంది పట్టుపడ్డారు.(Samantha)

Also Read: Samantha: కొండా సురేఖ సమంత ఇష్యూలోకి పవన్ కళ్యాణ్.. చెడుగుడు ఆడుతున్న సామ్ ఫ్యాన్స్.?

కానీ వారందరూ డ్రగ్స్ తీసుకోలేదు అని క్లీన్ చిట్ తో బయటికి ఎలా వచ్చారు. పోలీసులు ఏదైనా చేసారా లేక కేటీఆర్ ఏదైనా చేశారా..నార్సింగి, మాదాపూర్,రాయదుర్గం, జూబ్లీహిల్స్ వంటి పోలీస్ స్టేషన్లో కేటీఆర్ డైరెక్ట్ నెంబర్ ఉంటుంది. ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో లేదా డ్రగ్స్ కేసులో పట్టుబడితే టక్కున ఆయనకు ఫోన్ వెళుతుంది. వాళ్ళు ఇట్టే బయటకు వస్తారు.

producer shocking comments on Samantha Ktr relation

ఇక కేసీఆర్ ఉన్న సమయంలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు. కానీ ఎందుకు కూల్చలేకపోయారు.ఇక్కడ ఏదో అనుమానించాల్సిన విషయం ఉంది కదా.ఇక కేటీఆర్ సమంతకు సంబంధించిన ఈ విషయం నాకు తెలియదు. తెలియని దానీతో నాకు సంబంధం లేదు. ఇక ఈ విషయంలో నిజం ఉంటే కొండా సురేఖ ప్రూఫ్స్ చూపించాలి అంటూ కొండా సురేఖకి మద్దతుగా నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలపై చాలామంది ఫైర్ అవుతున్నారు.(Samantha)