Revanth Reddy: Konda Surekha Comments are a Diversion

Revanth Reddy: డైవర్షన్ రాజకీయాలను చేయడంలో చంద్రబాబుకు మించిన రాజేకేయ నాయకుడు లేడు. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిస్థితులను చూస్తుంటే అది మరోసారి నిజమే అనిపిస్తుంది. అయితే దాన్ని అయన శిష్యుడు రేవంత్ రెడ్డి లక్షల పాటిస్తున్నట్లుంది. అయన ఐడియాలను అనుసరిస్తున్నాడు రేవంత్ రెడ్డి అని కొంతమంది చెబుతున్నారు. ప్రస్తుతం హైడ్రా పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఒక ఆసక్తికర పరిస్థితి ఏర్పడింది.

Revanth Reddy: Konda Surekha Comments are a Diversion

ఈ నేపథ్యంలో, మూసీ నది ప్రక్షాళన మరియు మూసీ సుందరీకరణ పై ఉత్పన్నమైన విమర్శలు తగ్గించుకునే విధంగా రేవంత్ కొండా సురేఖతో తాజా వ్యాఖ్యలు అనిపించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.సమంత-నాగచైతన్య విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలుగు సినీ ఇండస్ట్రీలో తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ చాలామంది కొండా సురేఖపై విరుచుకుపడ్డారు.

Also Read: Ram Gopal Varma: కొండా సురేఖ కు ఆర్జీవీ మద్దతు.. సారీ కూడా చెప్పొద్దంటూ!!

అయితే హైడ్రా కు సంబంధించి వచ్చిన ఆరోపణలు, రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. దీనికి సంబంధించి బాధితులు అందరూ కూడా రేవంత్ ను ఇష్టం వచ్చినట్లు తిట్టారు. సామాన్య ప్రజలు కూడా రేవంత్ ను విమర్శించారు. అయితే రేవంత్ రెడ్డి దేన్నీ డైవర్ట్ చేయడానికే ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించడని అంటున్నారు. ఆయన అనుసరించే పద్ధతులు చంద్రబాబు వంటి రాజకీయ నాయకులు అవలంభించే విధంగా ఉండటం గమనార్హం.  ప్రజల దృష్టిని మరలించడానికోసం చేపట్టిన ఈ ప్రయత్నం కొండా సురేఖ మెడచుట్టు బిగుస్తుంది చెప్పాలి.

ఏదేమైనా సమంత-నాగ చైతన్య విడాకులపై కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలు అక్కినేని కుటుంబాన్ని తీవ్రంగా కలచివేశాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా అభ్యంతరించిన అక్కినేని కుటుంబం, కొండ సురేఖపై లీగల్ యాక్షన్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయ వేదికగా ఉపయోగించడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే, ఈ విషయాన్ని కోర్టుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.