Samantha fans scolding Pawan Kalyan

Samantha: కాంగ్రెస్ మినిస్టర్ కొండా సురేఖ కేటీఆర్ పై అక్కినేని ఫ్యామిలీ పై, సమంత పై చేసిన కామెంట్లు మీడియాలో దుమారం సృష్టిస్తున్న వేళ సోషల్ మీడియాలో మరో రచ్చ జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ ని సమంత అభిమానులు ఏకీపారేస్తున్నారు.మరి కొండా సురేఖ సమంత ఇష్యులోకి పవన్ కళ్యాణ్ ఎందుకు వచ్చారు..పవన్ కళ్యాణ్ ని సమంత అభిమానులు ఎందుకు తిడుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..

Samantha fans scolding Pawan Kalyan

కొండా సురేఖ ఎలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిందో ఆ వ్యాఖ్యలపై ప్రతి ఒక్కరు ధ్వజమెత్తుతున్నారు.సోషల్ మీడియాలో అయితే ఈమె మాట్లాడిన మాటలపై ఎంతోమంది ఫైర్ అవుతూ మీరు అలాంటి వారే కావచ్చు.. అందుకే మా హీరోయిన్ సమంతని నిందిస్తున్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే అక్కినేని ఫ్యామిలీకి, సమంతకి సపోర్ట్ గా చిరంజీవి, నాని,శ్రీకాంత్ ఓదెల, ఎన్టీఆర్,సింగర్ చిన్మయి, మంచు విష్ణు,రోజా,కుష్బూ,ప్రకాష్ రాజ్ ఇలా ప్రతి ఒక్కరు స్పందించారు.(Samantha)

Also Read: Revanth Reddy: సురేఖ మంత్రి పదవి ఊస్టింగ్.. రేవంత్ రెడ్డి నిర్ణయం ఇదేనా..?

కొండా సురేఖని క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేశారు.అలాగే ఈమె వ్యాఖ్యలపై నాగార్జున, నాగచైతన్య,సమంత, అమలలు ఖండించారు. అయితే ఈ విషయంలో సడన్ గా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావానికి వస్తుంది. ఇంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు స్పందిస్తుండగా పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడం లేదు..

Samantha fans scolding Pawan Kalyan

ఆడవాళ్లు దేవతలు అని చెప్పే పవన్ కళ్యాణ్ ఎందుకు సమంత విషయంలో మౌనం పాటిస్తున్నారు. రేవంత్ రెడ్డికి మీకు ఏదైనా రిలేషన్ ఉందా.. బిజెపిలో ఉంటూ కాంగ్రెస్ వాళ్ల మీద అభిమానం ఏంటి..వెంటనే మీరు సమంతకి మద్దతుగా స్పందించాల్సిందే.. లేకపోతే ఈ ట్వీట్ల రచ్చ కొనసాగుతూనే ఉంటుంది అంటూ పవన్ కళ్యాణ్ కి సోషల్ మీడియాలో సమంత అభిమానులు ఏకిపారేస్తున్నారు.(Samantha)