Varun Chakravarthy: బంగ్లాదేశ్ తో జరిగే మూడు టీ20ల సిరీస్ కు టీమిండియా జట్టును ప్రకటించారు. ఇందులో ఒక నటుడు కూడా చోటును దక్కించుకున్నాడు. అతను మరెవరో కాదు వరుణ్ చక్రవర్తి. మూడేళ్ల అనంతరం భారత జట్టులోకి వరుణ్ చక్రవర్తి తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు అందరూ వరుణ్ చక్రవర్తి గురించి మాట్లాడుకుంటున్నారు. అతను టి20wc 2021లో తన చివరి మ్యాచ్ ఆడాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరిగే మూడు టీ20 మ్యాచ్లు ఆడేందుకు వరుణ్ చక్రవర్తి సిద్ధమయ్యాడు. Varun Chakravarthy

varun chakravarthy acted in movie jeeva on inr 1400 per day now comeback in team india

ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి లైఫ్ స్టోరీ తెలుసుకోవడానికి కొంతమందిని ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా వరుణ్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంలో కొన్ని విషయాలను షేర్ చేసుకున్నాడు. ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో భాగంగా వరుణ్ మాట్లాడుతూ…. టీమిండియా, ఐపీఎల్ మ్యాచులు ఆడడానికి ముందు సినిమాల్లో కూడా పనిచేశాను. 2024 సంవత్సరంలో క్రికెట్ ఉత్తమ “జీవ”లో అతిధి పాత్రలో నటించానని వరుణ్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అంతేకాకుండా తాను అసిస్టెంట్ డైరెక్టర్ కావాలనుకున్నట్లు చెప్పాడు. Varun Chakravarthy

Also Read: IND vs BAN: టీమిండియాలో గంభీర్ కొత్త రూల్స్…అందుకే బంగ్లా చిత్తు !

కానీ దురదృష్టవశాత్తు అసిస్టెంట్ డైరెక్టర్ కాలేకపోయాను. కానీ రెండు మూడు సన్నివేశాలు ఉన్న చిత్రంలో అతిథి పాత్రలో నటించాను. ఆ సినిమాలో పనిచేస్తున్నప్పుడు నాకు రోజుకు రూ. 1400 రూపాయలు వచ్చేవి. వాటితోనే కాలం గడిపే వాడినని వరుణ్ చక్రవర్తి వెల్లడించాడు. కాగా, 2019లో ఐపీఎల్ లోకి అరంగేట్రం చేసిన వరుణ్ చక్రవర్తి 2021లో భారత్ తరపున తొలి మ్యాచ్ ఆడడం జరిగింది. ఐపిఎల్ లో 71 మ్యాచ్లు ఆడి 83 వికెట్లు తీసిన మిస్టరీ స్పిన్నర్ గా వరుణ్ నిలిచాడు. భారత్ తరపున ఆడిన 6 టీ20 మ్యాచుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం వరుణ్ చక్రవర్తి బంగ్లాదేశ్ తో టి20 మ్యాచ్ లు ఆడెందుకు సిద్ధంగా ఉన్నాడు. బంగ్లాదేశ్ తో టీమ్ ఇండియా 3టీ20 మ్యాచ్ లు ఆడనుంది. Varun Chakravarthy