Andhra Pradesh Government: టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దసరా కానుకగా భారీగా పథకాలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని సమాచారం. ఇందులో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను దసరా నుండి అమలు చేయడానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తారు.

Andhra Pradesh Government Free Bus Travel for Women

ప్రధానంగా మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ప్రయాణించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ విషయంపై మంత్రివర్గం సీరియస్ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో పర్యటించి, ఈ అంశంపై నివేదికను ప్రభుత్వం కు అందించారు. జిల్లాలో మహిళలకు ఉచిత బస్సు సేవలు అందించడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: Nagarjuna vs. Konda Surekha: మరో దావా వేయబోతున్న నాగ్.. 100 కోట్లకు పైగా పరువునష్టం!!

ఈ ఉచిత బస్సు సదుపాయానికి సంబంధించి విధి విధానాలను కూడా ఖరారు చేస్తున్నారని సమాచారం. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకునే అవకాశముంది. అందరికీ అవకాశమిస్తే, పేదరికాన్ని కొలమానంగా తీసుకుని ఉచిత బస్సు సదుపాయాన్ని అమలు చేయాలా అనే చర్చ కూడా ఉంది.

అంతేకాక, ఈ నెలాఖరున దీపావళికి ఉచితంగా మహిళలకు మూడు వంట గ్యాస్ సిలిండర్లు అందించడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. 18 సంవత్సరాల పైబడ్డ మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామన్న పథకం కూడా చర్చనీయాంశంగా ఉందని సమాచారం. రైతులకు ఏడాదికి 20 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. ఈ విధానాలను త్వరలో అమలు చేయాలని టీడీపీ కూటమి పట్టుదలగా ఉంది.