Chiranjeevi and Ram Charan: ఈ దసరా తెలుగు సినీ ప్రేమికులకు మరిచిపోలేనిది గా మారబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ నటిస్తున్న కొత్త సినిమాల టీజర్లు దసరా సందర్భంగా విడుదల కానున్నాయి. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా, రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్ర షూటింగ్‌లు శరవేగంగా కొనసాగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ రెండు చిత్రాల టీజర్లను దసరా పండుగ కు విడుదల చేయాలని చిత్ర బృందాలు యోచిస్తున్నాయి.

Chiranjeevi and Ram Charan Teasers to Release This Dasara

ఇప్పటికే, సంగీత దర్శకుడు థమన్ తన సోషల్ మీడియా ద్వారా గేమ్ చేంజర్ టీజర్ దసరాకు సిద్ధమైందని ప్రకటించాడు. ఇదే సమయంలో, విశ్వంభర టీజర్ కూడా దసరాకు విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుండగా, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ క్రిస్మస్ నాటికి థియేటర్లలోకి రానుంది.

Also Read: Devara: ‘దేవర’ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..ఈరోజు నుండి సాధారణ రేట్లు!!

ఈ రెండు భారీ సినిమాలు ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. మెగా అభిమానులకు ఈ దసరా ఒక డబుల్ ధమాకా అయిందని చెప్పవచ్చు. తమ అభిమాన హీరోల టీజర్లు ఒకే పండుగ సీజన్‌లో విడుదల అవ్వడం వారికెంత ఉత్సాహంగా ఉంటుందో చెప్పటానికి మాటలు సరిపోవు.