Devara: జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించి, లాభాల దశలోకి చేరింది. విదేశీ మార్కెట్‌లోనూ మంచి ఆదరణ పొందుతూ, విజయవంతమైన రన్‌ను కొనసాగిస్తోంది.

Devara Ticket Prices Drop Soon Families Expected

ఈ చిత్రానికి పెంచిన టికెట్ రేట్లు ఈ వారాంతంతో ముగియనున్నాయి. ఆ తర్వాత సాధారణ రేట్లు అమలులోకి రానున్నాయి. దసరా సెలవులు కూడా ప్రారంభమవడంతో, కుటుంబాలు పెద్ద ఎత్తున సినిమా థియేటర్లకు రావడానికి సిద్ధమవుతున్నాయి. ఇదే సమయంలో, సినిమాలో మొదట చేర్చని ‘దావుదీ’ పాటను ఈరోజు నుండి థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ఈ పాటను పెద్ద తెరపై చూడాలని అనుకునే ప్రేక్షకులు మరొకసారి సినిమాకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

Also Read: Ms Dhoni: RCBపై కోపంతో..టీవీ పగలగొట్టిన ధోనీ ?

దసరా సెలవులు, ‘దావుడి’ పాట జోడింపు, టికెట్ ధరల తగ్గింపు వంటి అంశాలు ‘దేవర’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద మరింత ఊతమిచ్చేలా కనిపిస్తున్నాయి. ఈ అన్ని అంశాలు కలసి సినిమాకు బలాన్ని చేకూరుస్తున్నాయి, వసూళ్లు మరింతగా పెరగడం ఖాయం.

సాధారణంగా, సినిమా విడుదలైన కొన్ని రోజులకు వసూళ్లు తగ్గిపోవడం సర్వసాధారణం. కానీ ‘దేవర’ మాత్రం ఈ ధోరణికి మినహాయింపు అవుతూ, ప్రేక్షకుల ఆదరణను పూర్తిగా సంపాదించుకుంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివల కాంబినేషన్ ఈ సినిమాతో మరో విజయవంతమైన సినిమా జాబితాలో చేరింది.