Jayam Ravi love with that heroine Engagement in Goa

Jayam Ravi: జయం రవి విడాకుల వార్తలు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్న వేళ తాజాగా ఓ హీరోయిన్ తో ఎంగేజ్మెంట్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు జయం రవి.. తాజాగా పూల మాలలతో ఈ జంట సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ జయం రవి ఈ హీరోయిన్ ని పెళ్లి చేసుకోవడం కోసమే బంగారం లాంటి భార్యకు విడాకులు ఇచ్చేసారా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి ఇంతకీ జయం రవి పెళ్లి చేసుకోబోతున్న ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Jayam Ravi love with that heroine Engagement in Goa

జయం రవి ఎంగేజ్మెంట్ చేసుకునేది ఎవరినో కాదు రీసెంట్ గా నాని హీరోగా చేసిన సరిపోదా శనివారం మూవీలో లేడీ పోలీస్ పాత్రలో హీరోయిన్ గా నటించిన ప్రియాంక మోహన్.. జయం రవి ప్రియాంక మోహన్ ని గోవాలో రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకొని దగ్గరి వారికి పెద్ద పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది.. ఇక వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్న ఫోటోలు కొన్ని మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామంది ఈ ఫోటోలు చూసి నోరెళ్ళబెడుతున్నారు. (Jayam Ravi)

Also Read: Konda Surekha: కేసీఆర్ కనపడట్లేదు.. కేటీఆర్ గొంతు పిసికి చంపిండేమో అని మాకు అనుమానం!

ఇదేంటి మొన్ననే విడాకులు అప్పుడే రెండో పిళ్లా అంటూ కామెంట్లు పెడుతున్నారు.. అయితే నిజంగానే ప్రియాంక మోహన్ జయం రవి ఎంగేజ్మెంట్ చేసుకున్నారంటే మీరు పప్పులో కాలేసినట్టే.ఎందుకంటే ఇది నిజమైన ఎంగేజ్మెంట్ కాదు.. సినిమా షూటింగ్లో భాగం..అవును మీరు వినేది నిజమే.. ప్రస్తుతం జయం రవి బ్రదర్ అనే సినిమాలో హీరోగా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటిస్తోంది.

Jayam Ravi love with that heroine Engagement in Goa

అలా ఓ పాట కోసం వీరిద్దరూ ఎంగేజ్మెంట్ ఉంటుంది. అయితే ఆ ఫొటోస్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో చాలామంది నెటిజన్స్ వీరి ఎంగేజ్మెంట్ నిజంగానే జరిగింది కావచ్చని భావిస్తున్నారు. అయితే ఈ ఫొటోస్ బయటికి రావడానికి కారణం ప్రమోషనల్ స్టాంట్ అని,ఈ మధ్యనే విడాకులు తీసుకున్న జయం రవి ఎంగేజ్మెంట్ ఫొటోస్ వైరల్ అయితే సినిమాపై మరింత హైప్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో చిత్ర యూనిట్ ఈ ఫోటోలను బయటికి వచ్చేలా చేసినట్టు తెలుస్తోంది.(Jayam Ravi)