Rakul Preet Singh Sensational comments

Rakul Preet Singh: గత కొద్ది రోజులుగా రకుల్ ప్రీత్ సింగ్ పై ఓ రూమర్ చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే.. అదేంటంటే రకుల్ ప్రీత్ సింగ్ ఓ రాజకీయ నాయకుడితో ఎఫైర్ పెట్టుకొని చాలా రోజులు డబ్బులు వెనకేసుకుందని, అంతేకాకుండా హైదరాబాదులో ఆ రాజకీయ నాయకుడికి వలవేసి అక్కడే పెద్ద లగ్జరీ ఫ్లాట్ నీ ఆయనతో కొనుగోలు చేయించింది అనే టాక్ కూడా వినిపించింది.

Rakul Preet Singh Sensational comments

ఇక అప్పట్లో రకుల్ ప్రీత్ సింగ్ లగ్జరీ ప్లాట్ కొనుక్కున్న సమయంలో రకుల్ ప్రీత్ సింగ్ కి ఆ రాజకీయ నాయకుడే లగ్జరీ ఫ్లాట్ ని కొనిచ్చాడు అంటూ రూమర్స్ వినిపించాయి. రకుల్ ప్రీత్ సింగ్ తండ్రి ఘాటుగా స్పందించడంతో ఇండస్ట్రీలో వీటన్నింటిని కామన్ గా తీసుకోవాలి మనం స్పందిస్తే అది నిజమే అనుకుంటారు వదిలేయండి నాన్న అని రకుల్ ప్రీత్ సింగ్ చెప్పిందట. (Rakul Preet Singh)

Also Read: Devara: దేవర సినిమా నే నిరాశను కలిగించింది.. ఇక దేవర 2 ఉండదేమో!!

అయితే తాజాగా కొండా సురేఖ సమంతపై అక్కినేని ఫ్యామిలీ పై కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై రకుల్ ప్రీత్ సింగ్ స్పందిస్తూ..ఒక బాధ్యత కలిగినటువంటి మహిళా మంత్రి స్థానంలో ఉన్న ఆమె ఇలాంటి నిరాధారమైన మాటలు మాట్లాడడం సిగ్గుచేటు.. చాలా అవమానకరం బాధగా అనిపిస్తుంది.. నా మీద కూడా ఇలాంటి రూమర్స్ వచ్చాయి. నాకు ఏ రాజకీయ నాయకుడితో ఎఫైర్ లేదు. సంబంధం లేదు.

Rakul Preet Singh Sensational comments

అసలు నేను రాజకీయాలకే దూరంగా ఉంటాను.నేను పూర్తి రాజకీయ వ్యతిరేకిని.ఏ పార్టీకి నేను మద్దతుగా ఉండను.మీ నీచ రాజకీయాల కోసం మా పేర్లను వాడకండి.ఇంకొకసారి నా పేరును రాజకీయాల కోసం వాడుకుంటే బాగుండదు. ఇప్పటికైనా రాజకీయాల్లో నా పేరును వాడకుండా ఉంటారని నేను భావిస్తున్నాను అంటూ రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ పోస్ట్ పెట్టింది.(Rakul Preet Singh)