TTD Clears the Air on Tirumala Flagstaff Incident

TTD: తిరుమలలో శ్రీవారి ధ్వజస్తంభంపై ఉన్న కొక్కెం విరిగిపోయిందని వచ్చిన వార్తలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఖండించింది. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో ఈ సంఘటన జరిగిందని మరియు ఇది అపశకునమని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. అయితే, టీటీడీ అధికారులు ఈ వార్తలు పూర్తిగా తప్పుడు అని స్పష్టం చేశారు.

TTD Clears the Air on Tirumala Flagstaff Incident

బ్రహ్మోత్సవాలకు ముందు ప్రతి సంవత్సరం వాహనాలను పరిశీలించడం జరుగుతుందని, అవసరమైతే కొత్త వాటిని అమర్చడం జరుగుతుందని చెప్పారు. ఈ సారి ధ్వజపటం కు చెందిన కొక్కెం పాతది కావడం వల్ల, దాన్ని తొలగించి కొత్తదాన్ని అమర్చినట్టు టీటీడీ ప్రకటించింది. ఈ ప్రక్రియ అనంతరం ఈ వార్తలు వైరల్ అవ్వడం దురదృష్టకరమని టీటీడీ తెలిపింది.

Also Read: Prabhas: అప్పుడే రాజాసాబ్ షూటింగ్ పూర్తి చేసిన ప్రభాస్.. ఈఏడాదిలో ఫౌజీ కూడా!!

తిరుమలలో ఎలాంటి అపశకునాలు లేవని, భక్తులు అటువంటి వదంతులను నమ్మవద్దని టీటీడీ అధికారులు కోరారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి, భక్తులు నిర్మలమైన మనసుతో స్వామిని దర్శించుకోవాలని ఆ సంస్థ సూచించింది.

అలాగే, శ్రీవారి బ్రహ్మోత్సవాలకు 4,000 మంది సేవకులను నియమించారు. ఈ సేవకులు భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, లడ్డూ ప్రసాదాలు అందించడంలో సహాయం చేస్తారు. టీటీడీ ఈవో శ్యామలరావు సేవకులను ఉద్దేశించి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు ప్రయత్నించాలని సూచించారు. శ్రీవారి సేవకులుగా ఎంపికైనందుకు వారు అదృష్టవంతులని, భక్తులకు నిష్ఠతో సేవ చేయాలని టీటీడీ కోరింది.