Mohan Raj: తెలుగు, తమిళ, మలయాళ చిత్రసీమలకు విలన్‌గా తనదైన ముద్ర వేసుకున్న మోహన్ రాజ్ ఇకలేరు. ఆయన గురువారం కేరళలోని తిరువనంతపురంలో తుదిశ్వాస విడిచారు. మోహన్ రాజ్ తన విభిన్నమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తెలుగులో ఆయన పోషించిన విలన్ పాత్రలు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిరంగా నిలిచిపోయాయి.

Veteran Actor Mohan Raj Passes Away at 64

‘లారీ డ్రైవర్’, ‘శివయ్య’, ‘అసెంబ్లీ రౌడీ’, ‘సమరసింహారెడ్డి’, ‘చెన్నకేశవరెడ్డి’ వంటి సినిమాల్లో ఆయన నటన ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. మూడు దశాబ్దాల పాటు సినీ రంగంలో కొనసాగిన ఆయన సుమారు 300కు పైగా సినిమాల్లో నటించారు. మలయాళ సినిమా ‘కిరీడమ్’లో కీరిక్కడన్ జోస్ పాత్రతో ఆయనకు మంచి గుర్తింపు లభించింది.

Also Read: War 2: దేవర హిట్ జోష్ లో వార్ 2 సెట్ లో కి అడుగుపెట్టిన ఎన్టీఆర్!!

మోహన్ రాజ్ మరణం తెల్సిన వెంటనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సాజి చెరియన్ తమ సంతాపాన్ని ప్రకటించారు. మలయాళ చిత్రసీమతో పాటు తెలుగు సినీ పరిశ్రమ కూడా ఆయన ఆకస్మిక మరణంతో తీవ్ర దిగ్భ్రాంతి చెందింది.

మోహన్ రాజ్ చేసిన విలన్ పాత్రలు తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. విలన్ పాత్రలకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చి ఆయన మన మధ్య లేకపోయినా, ఆయన నటన మాత్రం ఎప్పటికీ అజరామరంగా నిలుస్తుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం.