Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అట్టర్ ప్లాప్ అయిన నేపథ్యంలో.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రక్షాళనకు తెర లేపారు. వైసీపీని మళ్లీ గాడిలో పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఇందులో భాగంగానే… జిల్లాల ఇన్చార్జిల ను మార్చుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారు వైఎస్ జగన్. Jagan

Jagan Action On Ycp Sajjala

ఇందులో భాగంగానే వైసిపి పార్టీ సలహాదారులు అయినా సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారట జగన్. అతి త్వరలోనే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం అందుతుంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి సజ్జల కూడా కారణమని చాలామంది వైసిపి నేతలు ఫిర్యాదు చేశారట. దీంతో జగన్మోహన్ రెడ్డి చాలామంది వైసిపి కీలక నేతలతో తాజాగా సమావేశం అయ్యారని సమాచారం. ఈ సందర్భంగా సజ్జల పరిస్థితిపై ఆరా తీశారు జగన్. Jagan

Also Read: YSR District Name Change: వైఎస్సార్ జిల్లా పేరు మార్చే పనిలో చంద్రబాబు.. వైసీపీ ఊరుకుంటుందా?

అయితే 90% మంది సభ్యుల రామకృష్ణారెడ్డిని తీసివేయాలని కోరినట్లు తెలుస్తోంది. కొత్త సలహాదారున్ని తీసుకుంటేనే పార్టీ బాగుపడుతుందని వారు చెప్పారట. దీంతో సజ్జల రామకృష్ణారెడ్డిని తీసివేసి… ఓ ప్రముఖ జర్నలిస్టును వైసీపీ సలహాదారులుగా పెట్టుకోవాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాకా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి పార్టీ కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. నాలుగు ఎంపీ సీట్లు మాత్రమే వైసీపీ దక్కాయి. Jagan