Jani Master victim Sanchala audio leaked

Jani Master: జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధిత మహిళకు సంబంధించి ప్రస్తుతం మీడియాలో సంచలన ఆడియో కాల్ లీక్ అయింది.ఇక ఈ ఆడియో కాల్ లో జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధిత మహిళ అలాగే జానీ మాస్టర్ డ్రైవర్ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ బయటపడింది. ఇక ఈ సంభాషణ మొత్తం రికార్డ్ అవ్వడంతో ఈ ఆడియో కాల్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Jani Master victim Sanchala audio leaked

ఇక ఈ ఆడియో కాల్ వింటే మాత్రం జానీ మాస్టర్ నిర్దోషి అని, ఆయనపై కావాలనే ఆ అమ్మాయి టార్గెట్ చేసి కేసు పెట్టింది అని విషయం అందరికీ అర్థమవుతుంది.మరి ఇంతకీ ఆ బాధిత మహిళ జానీ మాస్టర్ డ్రైవర్ తో ఏం మాట్లాడిందయ్యా అంటే.. నేను మాస్టర్ ని ప్రేమించింది నిజమే. ఆయన్ని పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాను. (Jani Master)

Also Read: Sunil: నీ మొహానికి కారు కాదు ఆటో సెట్ అవుతుంది అంటూ సునీల్ ని అవమానించిన స్టార్ హీరో తండ్రి.?

కానీ ఈ విషయం అక్కకి తెలియడంతో ఆయన సైలెంట్ అయిపోయారు. అందుకే మాస్టర్ ని మర్చిపోలేక పాత వీడియోలన్నీ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను.ఆయన నాతో మాట్లాడడం లేదు. నాకు చాలా బాధేస్తుంది.. అంటూ చెప్పింది.ఇక ఈమె మాటలు విన్న జానీ మాస్టర్ డ్రైవర్ మరి మీకు జానీ మాస్టర్ రింగ్స్, నెక్లెస్ రెండు ఇచ్చారు కదా అని అడిగితే..ఆ రెండిటిని మాస్టర్నే నా ఇంటికి వచ్చి తీసుకు వెళ్ళమను.

Jani Master victim Sanchala audio leaked

నేను మాత్రం ఎవరికి ఇవ్వను. అలాగే ఆయనకు నేను ఇచ్చిన వాచ్ గిఫ్ట్ ఆయన దగ్గరే ఉండనివ్వు. నేను వాటిని తీసుకోను అంటూ జానీ మాస్టర్ పై కేసు పెట్టిన బాధిత మహిళా మాట్లాడిన సంచలన ఆడియో లీక్ అవ్వడంతో జానీ మాస్టర్ కేస్ పై కాస్త ఊరట కలిగే న్యూస్ వినిపిస్తోంది అంటూ ఆయన అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ఆడియో లీక్ తో జానీ మాస్టర్ కేసు నుండి బయట పడతారని తెలుస్తోంది.(Jani Master)