Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వివాహం చేసుకున్నారు. గురువారం రోజున ఆయన వివాహం ఘనంగా జరిగింది. దేశ రాజధాని కాబూల్ లో రషీద్ వివాహ వేడుక జరిగింది. ప్రస్తుతం రషీద్ ఖాన్ పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Rashid Khan Wedding in Kabul

ప్రపంచంలోనే నెంబర్ వన్ టి20 స్పిన్నర్ గా ఉన్న ఈ ఆఫ్గాన్ స్టార్ పెళ్లి ఫష్తూన్ ఆచార సాంప్రదాయం ప్రకారం జరిగింది. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టు నుండి పలువురు క్రికెటర్లు, ప్రముఖులు అతని వివాహానికి హాజరయ్యారు. రషీద్ పెళ్లి జరిగిన కాబుల్ లోని హోటల్ బయట భారీ బందోబస్తు ఏర్పరిచారు. దాని తాలూకు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Varun Chakravarthy: రూ.1400లకు సినిమాల్లో చేశాడు..కానీ ఇప్పుడు టీమిండియా హీరో అయ్యాడు ?

కాగా, రషీద్ ఖాన్ తో పాటు అతని ముగ్గురు సోదరులు ఒకే రోజున వివాహం చేసుకున్నారు. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన రషీద్ ఖాన్ కు పలువురు క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రషీద్ ఈ తరం అత్యుత్తమ క్రికెటర్లలో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. బౌలింగ్ తోనే కాకుండా అప్పుడప్పుడు బ్యాటింగ్ తోనూ తన అద్భుతమైన ఆట తీరును ప్రదర్శిస్తాడు.