Sudheer Babu who cheated Manchu Manoj

Sudheer Babu: ఏంటి సుధీర్ బాబు చేతిలో మంచు మనోజ్ బకరా అయ్యాడా..అదేలా.. మంచు మనోజ్ ని ఎలా బకరా చేయగలిగాడు.. ఇంతకీ ఇందులో ఉన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.. సినిమా హీరోలు ప్రమోషన్స్ కోసం ఏదైనా చేస్తారు..తమ సినిమా జనాల్లో రీచ్ అవ్వడం కోసం ఎలాంటి పనులు చేయడానికి అయినా ఈ మధ్యకాలంలో సిద్ధమవుతున్నారు.అయితే అలాంటిది సుధీర్ బాబు కాస్త వెరైటీగా తన సినిమా ప్రమోషన్స్ చేసుకున్నారు.ఇక అసలు విషయం ఏమిటంటే..

Sudheer Babu who cheated Manchu Manoj

మహేష్ బాబు బావ సుధీర్ బాబు హీరోగా మా నాన్న సూపర్ హీరో అనే మూవీ అక్టోబర్ 11న విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ని భారీగా చేస్తున్నారు. ఈ సినిమాలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధం ఉంటుంది అని డైరెక్టర్ ముందే చెప్పేశారు. అలాగే వీరి మధ్య బంధం చాలా ఎమోషనల్ గా సాగుతుందని కూడా హైప్ పెంచేశారు. (Sudheer Babu)

Also Read: Pawan Kalyan: సొంత అన్నకి సపోర్ట్ ఇవ్వకుండా పవన్ ఏం పీకాడు.. పోసాని సంచలన కామెంట్స్..?

అయితే తాజాగా తన చిత్ర ప్రమోషన్ కోసం మంచు మనోజ్ ని చాలా తెలివిగా వాడుకున్నారు సుధీర్ బాబు. ఇక విషయం ఏమిటంటే.. మనోజ్ కారు దిగి బయటికి వస్తుండగా ఫోటోగ్రాఫర్లు వచ్చి మనోజ్ ని ఫోటోలు తీశారు.అయితే ఆ వెనకే ఓ వ్యక్తి ఏదో ప్లాన్ చేశాడు.కానీ అది వర్కౌట్ అవ్వలేదు.ఇంకాస్త ముందుకు మంచు మనోజ్ వచ్చి ఫోటోలు దిగాడు.ఇక ఆ టైంలో సుధీర్ బాబుకు సంబంధించిన మా నాన్న సూపర్ హీరో అనే పోస్టర్ ని పెట్టి మనోజ్ తిరిగేలోపే అక్కడ నుండి తీసేసారు.

Sudheer Babu who cheated Manchu Manoj

అయితే ఈ వీడియోని సుధీర్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ మంచు మనోజ్ కి సారీ చెబుతూ ఇంతకంటే మరో ఆప్షన్ నాకు కనిపించలేదు.. సారీ బ్రదర్ అంటూ పోస్ట్ చేశారు. ఇక ఈ పోస్టుకి మంచు మనోజ్ ని కూడా ట్యాగ్ చేయడంతో ఇది గమనించిన మనోజ్ పెద్ద బకరా అయ్యానుగా అన్నట్లు బ్రహ్మానందం కి సంబంధించిన ఒక సరదా మీమ్ షేర్ చేశారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫన్నీ ట్వీట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.(Sudheer Babu)