Exit Polls 2024: దేశవ్యాప్తంగా… అందరూ ఎదురుచూస్తున్న హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ తాజాగా రిలీజ్ అయ్యాయి. శనివారం రోజున… హర్యానాలో తుది విడత ఎన్నికలు పూర్తి అయిన తర్వాత… సాయంత్రం పూట ఎగ్జిట్ ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ హర్యానా అలాగే జమ్మూ కాశ్మీర్ ఎగ్జిట్ ఫలితాల ప్రకారం… కాంగ్రెస్ పార్టీ హవా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో బిజెపి పార్టీకి ఎదురు దెబ్బ తగిలేలా స్పష్టంగా కనిపిస్తోంది. Exit Polls 2024

Exit Polls 2024 of jammu and haryana

హర్యానాలో మరోసారి అధికారంలోకి వస్తానన్న బిజెపి పార్టీకి… ఊహించని ఎదురుదెబ్బే తగిలేటట్టు ఉంది. హర్యానాలో 90 స్థానాలు ఉంటే… దాదాపు కాంగ్రెస్ పార్టీ 57 స్థానాలు దక్కించుకుంటుందని.. మెజారిటీ సర్వే సంస్థలు ప్రకటించేసాయి. అటు బిజెపి పార్టీకి 27 స్థానాలు మాత్రమే హర్యానాలో వస్తాయని వెల్లడించాయి. దీంతో పదేళ్లుగా హర్యానాలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీకి ఎదురు తగిలేలా స్పష్టం అవుతోంది. హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 46 మాత్రమే. కానీ చాలా సర్వేలు కాంగ్రెస్ పార్టీకి 57 స్థానాలు వస్తాయని ప్రకటించేసాయి. Exit Polls 2024

Also Read: Amala: అమల దెబ్బకు దిగివచ్చిన కాంగ్రెస్?

దీంతో అక్కడ.. కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని అందరు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో… 2014 తర్వాత ఎన్నికలు జరిగాయి. ఇక జమ్మూ కాశ్మీర్లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ… పీడిపి పార్టీకి 28 స్థానాలు వస్తాయని సర్వే సంస్థలు తెలుపుతున్నాయి. అటు భారతీయ జనతా పార్టీకి 25 స్థానాలకు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సర్వే సంస్థలు వెల్లడించాయి. కాంగ్రెస్కు 12 అలాగే నేషనల్ కాన్ఫరెన్స్ కు 15 స్థానాలు దక్కుతాయని చెబుతున్నారు. అంటే ఇక్కడ పీడీపీ, కాంగ్రెస్, ఎన్సీ మూడు పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకునే ఛాన్స్ ఉంది. ఇక అక్టోబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. Exit Polls 2024