Koratala Siva Next Film Be With Mahesh Babu

Koratala Siva: టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివ తన తాజా చిత్రం ‘దేవర’తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడం తో ప్రేక్షకుల మన్ననలు పొందింది. ‘దేవర’ విజయం అనంతరం, కొరటాల శివ తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అందరి దృష్టి ఆయన తర్వాత చేయబోయే సినిమాపై నిలిచింది.

Koratala Siva Next Film Be With Mahesh Babu

కొరటాల శివ ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవితో ‘ఆచార్య’ సినిమాను తెరకెక్కించి, భారీ ఫ్లాప్ ను అందుకున్నారు. దేవర హిట్ తరవాత ఇప్పుడు ‘దేవర పార్ట్ 2’ చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ, ఆ ప్రాజెక్ట్ కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ క్రమంలో, ఆయన తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది.

Also Read: Katrina Kaif: కత్రినా కైఫ్ చేతిపై నల్లటి మచ్చ.. అసలు విషయం ఏమిటి?

టాలీవుడ్‌ అగ్ర హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, మహేష్ బాబు వంటి వారు తమ తమ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, కొరటాల శివ వీరిలో ఎవరితో జతకట్టబోతున్నారనే అంశం చర్చనీయాంశమైంది. ప్రత్యేకంగా మహేష్ బాబుతో మరో సినిమా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అభిమానులు ఈ కాంబినేషన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

కానీ ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో మేకోవర్‌కు సిద్ధమవుతున్నారు. అందువల్ల, రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు మహేష్ బాబు మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కష్టమే. దాంతో, కొరటాల శివ – మహేష్ బాబు కాంబినేషన్‌లో సినిమా త్వరగా రాకపోవచ్చు. మొత్తానికి, కొరటాల శివ తన తర్వాతి ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నారన్నది ఇంకా అటు అభిమానులకూ, సినీ పరిశ్రమకూ ఆసక్తికరమైన సస్పెన్స్‌గానే మిగిలింది.