Ratan Tata: టాటా గ్రూప్, దేశీయ మార్కెట్లో అగ్రస్థానంలో నిలిచిన దిగ్గజ సంస్థగా ప్రసిద్ధి చెందింది. ఈ సంస్థను ఈ స్థాయికి తీసుకురావడంలో ప్రధాన పాత్ర రతన్ టాటాకే చెందుతుంది. ఆయన దశాబ్దాలుగా టాటా గ్రూప్‌కి నాయకత్వం వహించి, సంస్థను విజయవంతంగా నడిపారు. చైర్మన్ బాధ్యతల నుంచి తప్పుకున్నప్పటికీ, రతన్ టాటా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ, చారిటబుల్ ట్రస్టులకు నేతృత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా, స్టార్టప్‌లను ప్రోత్సహించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tata Group Icon Ratan Tata Hospitalized

రతన్ టాటా విజనరీ వ్యక్తి. ఆయన పేదల కారు కలను సాకారం చేయాలనే లక్ష్యంతో, కేవలం లక్ష రూపాయలకే కారును తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేశారు. ఇది ఆయన వ్యాపార దృష్టికి, ప్రజల పట్ల ఉన్న కృతజ్ఞతకు నిదర్శనం. ఆయన దార్శనికత, వ్యాపార ప్రతిభ అనేకమందికి ఉపాధిని కల్పించడమే కాకుండా, ఎందరో యువ ఇంజినీర్లకు స్ఫూర్తిగా నిలిచాయి.

Also Read: TDP: తెలంగాణ లో టీడీపీ మళ్ళీ ప్రాణం పోసుకుంటుందా.. ఆ దిశగా చంద్రబాబు వ్యూహం!!

అయితే, ప్రస్తుతం రతన్ టాటా అనారోగ్యం బారిన పడ్డారు. 86 ఏళ్ల వయసున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో, ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో ఐసీయూలో చేర్పించారు. ఈ వార్త తెలియగానే దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

రతన్ టాటా త్వరగా కోలుకోవాలని సామాజిక మాధ్యమాల్లో చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు. దేశానికి ఎంతో కృషి చేసి ఈ దిగ్గజ వ్యాపారవేత్త మళ్లీ ఆరోగ్యవంతంగా బయటకు రావాలని అందరూ ఆశిస్తున్నారు.