Krithi Shetty Malayalam Debut "ARM" Nears ₹100 Crore Gross

Krithi Shetty: కృతి శెట్టి మలయాళ పరిశ్రమలో చేస్తున్న మొదటి చిత్రం “అజయన్టే రణ్డం మోషణం” (ARM) బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధిస్తోంది. టొవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తూ సెన్సేషనల్ లాంగ్ రన్ ను కొనసాగిస్తోంది. జితిన్ లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, కిష్కింధ కాండం అనే మిస్టరీ థ్రిల్లర్‌తో పోటీపడుతూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

Krithi Shetty Malayalam Debut “ARM” Nears ₹100 Crore Gross

కిష్కింధ కాండం కంటే ARM కి సమీక్షలు అంత బలంగా లేకపోయినా, ఇది 100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు సుమారు 97 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం, త్వరలోనే మూడు అంకెల మార్కును అందుకోనుందని అంచనా. కేరళలో 25వ రోజున 1 కోటి రూపాయలకు పైగా వసూలు చేసి, మలయాళ చిత్రాలలో అరుదైన ఘనత సాధించింది.

Also Read: Vishwam Movie: ఆ పుకార్లపై ఫైర్ అయిన శ్రీను వైట్ల.. విశ్వం పై మరింత నమ్మకంగా!!

తొలి వారంలో కిష్కింధ కాండం కంటే ARM మంచి ఓపెనింగ్స్ సాధించింది. కానీ రెండో వారం నుంచి కిష్కింధ కాండం పెరుగుతుండగా, ARM కాస్త వెనుకబడింది. అయినప్పటికీ, మూడో మరియు నాల్గవ వారాల్లో ARM చిత్రం తిరిగి పుంజుకుని మంచి వసూళ్లు సాధిస్తూ కిష్కింధ కాండం పై ఆధిక్యతను కొనసాగించింది.

ARM లో టొవినో థామస్ మూడు విభిన్న పాత్రల్లో నటించారు. సురభి లక్ష్మి, ఐశ్వర్య రాజేష్, బాసిల్ జోసెఫ్, హరీష్ ఉత్తమన్, రోహిణి వంటి ప్రముఖులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు UGM ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి.