NTR Devara Breaks Records at Box Office

Devara: ఎన్టీఆర్ నటించిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 400 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో సినిమా సంచలనం సృష్టించింది. ముఖ్యంగా ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో సినిమాకు ఉన్న కలెక్షన్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. రెండో ఆదివారం, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్ లలో 5.71 కోట్ల రూపాయల షేర్ వసూలు చేసింది. 10 రోజుల్లో ఆంధ్ర, సీడెడ్, నైజాం ప్రాంతాల్లో 121.66 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.

NTR Devara Breaks Records at Box Office

దేవర సినిమా 10 రోజుల ఏరియా వైజ్ AP, TS షేర్ (GST మినహా):

నైజాం – 46.81 కోట్లు
సీడెడ్ – 25.81 కోట్లు
విజయ్ – 12.70 కోట్లు
తూర్పు – 7.85 కోట్లు
పశ్చిమ – 6.12 కోట్లు
కృష్ణా – 7.20 కోట్లు
గుంటూరు – 10.16 కోట్లు
నెల్లూరు – 5.01 కోట్లు
మొత్తం 10 రోజుల AP, TS షేర్ – 121.66 కోట్లు (GST మినహా)

Also Read: Samantha Ruth Prabhu: కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత మొదటి సారి పబ్లిక్ గా రాబోతున్న సమంత!!

ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ముఖ్య పాత్రలు పోషించారు. నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కోసరాజు హరి కృష్ణ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం, అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతంతో కూడి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేవర సినిమా ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా గుర్తింపు పొందింది, ఇంకా ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఎన్టీఆర్ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది.