Who Will Be the Next Pan India Hero After Prabhas?

Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ డ్రామా “పుష్ప: ది రూల్” భారతదేశంలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్ర ట్రైలర్ నవంబర్ రెండో వారంలో విడుదల కానుంది. డిసెంబర్ 6న సినిమా విడుదల కానుండటంతో, మూడు వారాల ముందే ట్రైలర్ విడుదల చేయడం ద్వారా హిందీ సర్క్యూట్‌లలో బజ్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు.

Pushpa 2 Trailer Launch Sparks Buzz Across Social Media

ట్రైలర్ విడుదల సమయం దగ్గరపడుతుండటంతో అభిమానుల ఉత్సాహం రోజురోజుకు పెరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా ట్రైలర్ గురించి చర్చలు హాట్ టాపిక్ గా మారాయి. “పుష్ప: ది రైజ్” కొన్నేళ్ల క్రితం ఎంతటి సంచలన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సుకుమార్ పుష్ప 2 కోసం మరింత గ్రాండ్‌గా, పది రెట్లు పెద్దగా కథను మలచారని సమాచారం. ఈ సీక్వెల్‌లో ప్రేక్షకుల అంచనాలు మరింత పెంచారని, యాక్షన్ సీక్వెన్సులు, విజువల్స్, డైలాగ్స్ ట్రైలర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు అంటున్నాయి.

Also Read: Tanikella Bharani: తనికెళ్ల భరణికి బెదిరింపులు.. చంపేస్తానంటూ మెసేజ్ లు.?

ఫహద్ ఫాసిల్, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మాణం జరుగుతోంది. హిందీ భాషలో AA ఫిల్మ్స్, మలయాళంలో E4 ఎంటర్టైన్మెంట్, కన్నడలో N సినిమాస్, తమిళంలో AGS ఎంటర్టైన్మెంట్ ద్వారా విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మిగతా సాంకేతిక నిపుణులు ఛాయాగ్రహణంలో మిరోస్లావ్ కుబా బ్రోజెక్, ఎడిటింగ్‌లో కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ డైరెక్షన్‌లో రామకృష్ణ, మోనిక ఉన్నారు.