Singer Sunitha split in Kapuram

Sunitha: టాలీవుడ్ లో లేడీ సింగర్స్ ఎంతోమంది ఉన్నారు. కానీ వీరందరిలో అద్భుతమైన గాత్రంతో లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న సింగర్ ఎవరయ్యా అంటే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది సింగర్ సునీత మాత్రమే. ఆమె పాటలోనే మాధుర్యం కాకుండా ఆమె అందచందాలలో కూడా అగ్ర స్థానంలోనే ఉంటుంది. ఐదు పదుల వయసుకు దగ్గరికి వస్తున్నా కానీ ఇంకా 18 ఏళ్ల యువతిలా కనిపించడం ఆమె స్పెషాలిటీ.

Singer Sunitha split in Kapuram

అలాంటి సునీత తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి 1995లో ఎంట్రీ ఇచ్చిందట. గులాబీ అనే మూవీ ద్వారా ఈ వేళలో నీవు అనే పాట మొదటిసారిగా పాడి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సాంగ్ పాడిన తర్వాత ఆమెకు అప్పారావు డ్రైవింగ్ స్కూల్, సీతారాముల కళ్యాణం చూతము రారండి,అనగనగా ఓ కుర్రాడు, ఓం నమో వెంకటేశాయ, రెయిన్ బో వంటి చిత్రాల్లో ఆఫర్స్ వచ్చాయి. అలా వరుస సినిమాలలో తనదైన గొంతుతో పాటలను ఆలపిస్తూ బెస్ట్ సింగర్ గా పేరు తెచ్చుకుంది. ఈమె టాలెంట్ గాను ఇప్పటికే రెండు ఫిలింఫేర్ , 9 నంది అవార్డులు అందుకున్నది.( Sunitha )

Also Read: Aishwarya Rai: ఐశ్వర్యరాయ్ జీవితంలో ముంచుకొస్తున్న పెద్దగండం.. మిగిలేవి కన్నీళ్లేనా.?

ఈ విధంగా 15 సంవత్సరాల వయసులోనే ఈమె ఆలిండియా రేడియో నుండి జాతీయ అవార్డును కూడా అందుకుంది. ఇలా కెరియర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే వివాహం చేసుకుంది. ఆమె పెళ్లి చేసుకునే సమయంలో 19 సంవత్సరాలే ఉంది. ఆ తర్వాత టకటక ఇద్దరు పిల్లలు పుట్టారు. వారు పెద్దయ్యాక భార్యాభర్తల మధ్య కాస్త మనస్పర్ధలు రావడంతో తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. అలాంటి సునీత ఆ మధ్యకాలంలో బిజినెస్ మ్యాన్ అయినటువంటి రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. ఇప్పుడైతే ఈమె రెండో పెళ్లి చేసుకుందో అప్పటినుంచి సోషల్ మీడియాలో సునీత పై ట్రోల్స్ హాట్ టాపిక్ గా మారిపోయింది.

Singer Sunitha split in Kapuram

అయితే ఈమె రెండో వివాహం 2011 లో చేసుకుంది. ఇక అప్పటి నుంచి రెండో భర్తతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నటువంటి సునీత తాజాగా తన భర్తతో గొడవకు దిగిందట. దీనికి కారణం కూడా ఒక యూట్యూబర్ అని తెలుస్తోంది.. అయితే తాజాగా ఈ గాయని యూట్యూబర్ తో కలిసి కొన్ని ఫోటోలు వీడియోలు తీసుకుందట. వాటిని చూసినటువంటి తన రెండో భర్త రామ్ వీరపనేని ఈ ఫోటోలు ఏంటి ఇలా దిగావని సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ బాగా జరిగినట్టు తెలుస్తోంది.మరి చూడాలి ఈ గొడవ ఏ వైపు దారితీస్తుంది అనేది ముందు ముందు తెలుస్తుంది.( Sunitha )