Minister Narayana: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం దుకాణాల హడావిడి కనిపిస్తోంది. గత వైసిపి ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీని రద్దు చేసి తెలుగుదేశం కూటమి సర్కార్ కొత్తపాలసీని రెడీ చేసింది. ఈ మేరకు మొన్నటి వరకు టెండర్లను కూడా పిలవడం జరిగింది. గోవా తరహాలో తక్కువ ధరకు మద్యం అందించాలనే లక్ష్యంతో ఈ టెండర్లను ఆహ్వానించారు. Minister Narayana
3 wine shops for AP Minister Narayana
ఈ తరుణంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 3396 మద్యం దుకాణాలకు…. టెండర్లను పిలిచింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. రెండు రోజుల కిందట ఈ టెండర్ల ప్రక్రియ కూడా ముగిసిపోయింది. మొన్నటి నుంచి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లాటరీ ప్రకారం… మద్యం దుకాణాల విజేతలను ప్రకటిస్తోంది కూటమి సర్కార్. ఈ తరుణంలోనే ఓ షాకింగ్ నిజం బయటకు వచ్చింది. Minister Narayana
Also Read: Vemulawada: మరో వివాదంలో ఇరుకున్న కొండా సురేఖ ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… మంత్రిగా పనిచేస్తున్న నారాయణకు మూడు మద్యం దుకాణాలు దక్కాయి. తన అనుచరుల ద్వారా… ఒక నెల్లూరు జిల్లాలోనే 100 మద్యం దుకాణాలకు టెండర్లు వేశారట మంత్రి నారాయణ. ఒక్కో షాప్ కోసం రెండు కోట్లు… అడ్వాన్స్ పెట్టి మరి టెండర్ వేశారట. అయితే ఇందులో కేవలం మూడు మధ్య దుకాణాలే మంత్రి నారాయణ కు దక్కాయట. అయితే ఈ మూడు దుకాణాలను… ఐదుగురు చొప్పున 15 మంది తన అనుచరులకు అప్పగిస్తున్నారట నారాయణ. Minister Narayana