Kcr: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ఉద్యమ సింహం కల్వకుంట్ల చంద్రశేఖర రావు… మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. గులాబీ పార్టీని ఎమ్మెల్యేలు వీడుతున్న నేపథ్యంలో… పార్టీ నేతల్లో జోష్ నింపేందుకు ఏకంగా ఓమ్ని కారును నడుపుతూ… ఉత్సాహంగా కనిపించారు కల్వకుంట్ల చంద్రశేఖర రావు. తనలో కసి ఇంకా తగ్గలేదని… కారు కాదు ఏకంగా ఓమ్ని నడిపి చూపిస్తానని.. కెసిఆర్ రంగంలోకి దిగారు. Kcr
Omni steering is also in the hands of KCR Is it to give a warning to those MLAs
వాస్తవానికి 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా… గులాబీ పార్టీ ఓడిపోయిన తర్వాత కాలు జారి కింద పడ్డారు కేసీఆర్. ఆ సమయంలో.. కెసిఆర్ తుంటికి ఆపరేషన్ కూడా అయింది. అయితే అప్పటినుంచి కెసిఆర్ చాలా జాగ్రత్తగా నడుస్తున్నారు. తాజాగా… కాలు ఎక్ససైజ్ కోసం… ఓమ్ని నడపాలని వైద్యులు చెప్పారట. దీంతో… 70 ఏళ్లు దాటిన తగ్గేదే లేదు అంటూ… ఓమ్ని నడిపేసారు కేసీఆర్. Kcr
Also Read: Jagan: కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం…. జగన్ భయపడిపోతున్నాడా ?
దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఎర్రబొలిలోని తన ఫామ్ హౌస్ లో… అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ కేసీఆర్ కనిపించారు. అదే సమయంలో తన అభిమానులతో ఫోటోలు కూడా దిగారు. అయితే గులాబీ పార్టీ నేతలు… బయటకు వెళ్తున్న నేపథ్యంలో…. ఎవరు భయపడకూడదని… ధైర్యం చెప్పేలా తాజాగా… ఓమ్ని నడుపు కనిపించారు కేసీఆర్. Kcr
ఎవరు అధైర్య పడకూడదని… తెగించి కొట్లాటమే.. తమ స్వభావమని చెప్పేందుకు.. కెసిఆర్ ఇలా కనిపించినట్లు చెబుతున్నారు గులాబీ నేతలు. అలాగే తన కాలుకు ఎక్సర్సైజ్ కూడా… అవుతుందని కేసీఆర్ భావించారట. మొత్తానికి… గులాబీ పార్టీ సంక్షేమంలో ఉన్న సమయంలో… కెసిఆర్ ఓమ్ని నడపడం హాట్ టాపిక్ అయింది. కెసిఆర్ ఏది చేసినా సంచలనమే అవుతుంది. ఇప్పుడు ఈ డ్రైవింగ్ కూడా అదిరిపోయింది. Kcr