Hero Anand Reveals Struggles During Three Years

Hero Anand: తెలుగు తెరపై ఒకప్పుడు హీరోగా వెలిగిన ఆనంద్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇటీవల అయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తన సినీ జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘దొంగ దొంగ’ తన కెరీర్‌లో ఓ కీలక మలుపుగా నిలిచిందని, ఆ చిత్రంలో విక్రమ్, కార్తీక్, రెహమాన్ వంటి స్టార్‌లతో కలిసి నటించడం గర్వకారణమని ఆనంద్ తెలిపారు. ఈ ముగ్గురూ నేటికీ తనకు స్నేహితులుగా కొనసాగుతున్నారని అన్నారు.

Hero Anand Reveals Struggles During Three Years

ఆనంద్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న కష్టకాలాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న సమయంలో, అనుకోకుండా మూడేళ్లపాటు తనకు అవకాశాలు రావడం ఆగిపోయిందని, ఆ సమయంలో తీవ్ర ఆర్థిక, మానసిక ఒత్తిళ్లు ఎదుర్కొన్నట్లు చెప్పారు. తన కెరీర్‌లో ‘రోజా’ సినిమాలో హీరోగా నటించే అవకాశాన్ని కోల్పోవడం ఇంకా బాధగా ఉందని చెప్పారు, ఎందుకంటే ఆ అవకాశం అరవింద్ స్వామికి వెళ్లిపోయింది.

Also Read: Jaanu: పచ్చని జంటను విడదీసిన సినిమా.. ఆ జంట కి ఈ మూవీతో ఉన్న లింక్.?

తన సినీ జీవితంలో దివ్యభారతి మరణం పెద్ద బాధగా నిలిచిందని ఆనంద్ తెలిపారు. దివ్యభారతితో తనకున్న అనుబంధాన్ని, ఆమె తొలి సినిమాలో తానే హీరోగా నటించానని ఆయన గుర్తుచేసుకున్నారు. సౌందర్య మరణం కూడా తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.

అంతేకాకుండా, సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో తన ఆర్థిక పరిస్థితి కష్టాల్లో ఉన్నట్లు వచ్చిన వార్తలను ఆనంద్ ఖండించారు. తనకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవని, సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నానని స్పష్టం చేశారు. తన అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకోవడంతో ఆనంద్ అభిమానులను మరోసారి ఆకట్టుకున్నారు.