Kohli: క్రికెట్ రంగంలో సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతున్నటువంటి ఆటగాడు విరాట్ కోహ్లీ. ఈయనకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా దేశాల్లో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. విరాట్ కోహ్లీ అనుష్క శర్మను వివాహం చేసుకొని ఇద్దరు బిడ్డలకు జన్మనిచ్చారు. అలా సెలబ్రిటీ కపుల్స్ లో ఎంతో అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకొని జీవిస్తున్నారు. అలాంటి విరాట్ కోహ్లీ అనుష్క శర్మ తాజాగా విడిపోతున్నారని కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గుప్పుమంటున్నాయి. మరి అది నిజమేనా ఆ వివరాలు ఏంటో చూద్దాం..
Kohli Anushka Divorce
ఈ మధ్యకాలంలో సెలబ్రిటీ జంటల విడాకులకు సంబంధించి అనేక వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అభిషేక్ బచ్చన్ ఐశ్వర్యరాయ్. వీరిద్దరూ ఈమధ్య ఏ ఫంక్షన్లు జరిగినా విడివిడిగా హాజరవుతున్నారు. దీంతో వీరు విడిపోతున్నారనే వార్తలు జోరందుకున్నాయి. వారే స్వయంగా ఖండించిన కానీ వార్తలు ఆగడం లేదు.(Kohli)
Also Read: Rajinikanth: రజినీకాంత్ తో నటించనని అవమానించిన హీరోయిన్.!
ఈ సెలబ్రిటీ జంటల్లో ఎంతో అన్యోన్యమైన జంటగా పేరు తెచ్చుకున్న విరాట్ కోహ్లీ అనుష్క శర్మ పై కూడా విడాకుల వార్తలు వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం వీరిద్దరూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒకరినొకరు హేళన చేసుకున్నట్లుగా స్టోరీస్ పెట్టారు. వీటిని ఆధారంగా చేసుకున్నటువంటి అభిమానులు వీరు విడిపోతున్నారని అందుకే ఇలా పోస్టులు పెట్టుకుంటున్నారని అంటున్నారు. ఈ వార్తలపై అనుష్క గానీ విరాట్ కోహ్లీ కానీ ఎప్పుడు స్పందించలేదు.
దీంతో వీరు నిజంగానే విడిపోతున్నారు కాబట్టి స్పందించడం లేదు నే వార్తలు మరింత బలంగా రాస్తున్నారు. మరి ఈ సెలబ్రిటీ జంట నిజంగానే విడిపోతున్నారా.. లేదా అనేది క్లియర్గా తెలియాలి అంటే తప్పనిసరిగా వారు స్పందించే వరకు ఆగాల్సిందే.. ఇక కెరియర్ విషయానికి వస్తే.. అనుష్క శర్మ షారుక్ ఖాన్ పక్కన జీరో అనే చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఇక విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ తో ఇండియాలో జరగబోతున్నటువంటి టెస్టు సిరీస్ లో ఆడబోతున్నాడని తెలుస్తోంది.(Kohli)