Nayanthara: ఎంతోమంది హీరోయిన్లు తమకు జోడిగా నటించిన హీరోలతో ప్రేమలో పడి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. అయితే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా అప్పట్లో తెలుగు హీరోతో ప్రేమలో పడింది.ఇక వీరి మధ్య ప్రేమ ఎక్కడిదాకా అంటే పెళ్లి చేసుకునే వరకు వెళ్ళింది.కానీ చివర్లో వీరి ప్రేమ బ్రేకప్ అయిపోయింది.ఇక విషయంలోకి వెళ్తే..
Nayanthara is in love with that Telugu hero
శింబు ప్రభుదేవా వంటి హీరోలతో ఎఫైర్ నడిపిన నయనతార ఆ ఇద్దరు హీరోలతో పెళ్లి వరకు వెళ్ళింది.కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ వాళ్లకు బ్రేకప్ చెప్పేసి చివరిగా కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ తో ఏడేళ్లు సహజీవనం చేసి చివరికి పెళ్లి చేసుకుంది.అయితే విగ్నేష్ శివన్ కంటే ముందే తెలుగులో ఉండే ఓ హీరోతో నయనతార ప్రేమాయణం నడిపించిందట. (Nayanthara)
Also Read: Nara Rohith: నారా రోహిత్ పెళ్లాడబోయే హీరోయిన్ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాకే.?
ఇక నయనతార ప్రేమ ముచ్చట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పట్లో గట్టిగానే వినిపించాయి.ఇక ఆ హీరో తండ్రి కూడా పెళ్లికి ఒప్పుకున్నాక ఆ హీరో నువ్వు పెళ్లి అయ్యాక సినిమాల్లో నటించకూడదు అని ఒకే ఒక్క కండిషన్ పెట్టడంతో నాకు లైఫ్ ఇచ్చిన సినిమాలను నేను ఎప్పటికీ వదలను అని ఆయనకు బ్రేకప్ చెప్పిందట.
అయితే ఈ విషయంలో ఎంతమంది సర్ది చెప్పినా కూడా నయనతార తన నిర్ణయాన్ని మార్చుకోకపోయేసరికి ఆ తెలుగు హీరో ఇంటికి కూడా భార్యగా వెళ్లే ఛాన్స్ మిస్ అయింది.ఒకవేళ అన్ని బాగుంటే నయనతార ఆ తెలుగు హీరో ఇంటికి భార్యగా వెళ్ళేది అంటున్నారు ఈ విషయం తెలిసిన తెలుగు అభిమానులు.(Nayanthara)