Vemulawada: తెలంగాణ మహిళా మంత్రి కొండ సురేఖ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గత 15 రోజుల్లోనే ఏకంగా మూడు వివాదాల లో కొండ సురేఖ ఇరుక్కోవడం జరిగింది. అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల గురించి మాట్లాడి… 100 కోట్ల పరువు నష్టం దావా కట్టే పరిస్థితిని తెచ్చుకుంది తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. Vemulawada

konda surekha in another controversy in Vemulawada

అయితే ఈ కేసు మరువకముందే… మొన్న ఆదివారం రోజున మరో వివాదంలో ఇరుక్కున్నారు కొండా సురేఖ. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి వర్సెస్ కొండా సురేఖ మధ్య వివాదం రాజుకుంది. దసరా పండుగ నేపథ్యంలో ఫ్లెక్సీల వివాదం ఈ ఇద్దరి నాయకుల మధ్య జరిగింది. దీంతో పోలీసులను బెదిరించి… సీఐ సీట్లో… కొండ సురేఖ కూర్చున్నారట. ఈ వివాదం.. నిన్నటి నుంచి రచ్చ రచ్చ చేస్తోంది.
అయితే ఈ సంఘటన జరిగి 24 గంటలు గడవకముందే…. మరోబివాదంలో చిక్కుకున్నారు మహిళా మంత్రి కొండా సురేఖ. Vemulawada

Also Read: Ys Jagan: వైఎస్‌ జగన్‌ కు 16 నెలల జైలు శిక్ష ?

వేములవాడ రాజన్న భక్తులకు ఆగ్రహం తెప్పించేలా కొండా సురేఖ ప్రవర్తించారు. సోమవారం రోజున… రాజన్న సన్నిధికి కొండ సురేఖ వెళ్లడం జరిగింది. సోమవారం ద్వాదశి సందర్భంగా వేములవాడ రాజన్నకు మూడు గంటలకు నైవేద్యం పెట్టాలి. కానీ కొండా సురేఖ కారణంగా 30 నిమిషాలు లేటుగా… అర్చకులు నైవేద్యం పెట్టడం జరిగింది. అయితే స్వామివారికి నైవేద్యం పెట్టకుండా కొండా సురేఖకు ప్రత్యేక పూజలు ఎందుకు చేశారని… అక్కడ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి కంటే పెద్ద.. మనిషి కొండా సురేఖ అని మహిళా భక్తులు అంటున్నారు. దీనికి సంబంధించిన అంశం హాట్ టాపిక్ అయింది. Vemulawada