Adivi Sesh who hit heroine during the shooting

Adivi Sesh: అడివి శేష్ ప్రస్తుతం డెకాయిట్ మూవీలో చేస్తున్నారు.అలాగే గూఢచారి 2 సినిమాకి సంబంధించి కూడా త్వరలోనే కొత్త అప్డేట్ రాబోతుంది. ఇక ఈయన సినిమా లైఫ్ సాఫీగా సాగిపోతుంది అనుకున్న సమయంలోనే ఈ హీరో పై ఒక రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..అడివి శేష్ ఓ హీరోయిన్ తో గొడవ పెట్టుకొని షూటింగ్ స్పాట్లోనే చెంప దెబ్బ కొట్టాడని, దాంతో ఆ హీరోయిన్ అలిగి షూటింగ్ నుండి వెళ్లిపోయింది

Adivi Sesh who hit heroine during the shooting

అనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇక అసలు విషయం ఏమిటంటే.. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న డెకాయిట్ సినిమాలో హీరొయిన్ గా శృతిహాసన్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా షూటింగ్ స్పాట్ నుండి శృతిహాసన్ కి అడివి శేష్ కి మధ్య చిన్న గొడవ జరిగి ఆ గొడవ కాస్త పెద్దది అయిందట. (Adivi Sesh)

Also Read: Nayanthara: ఆ తెలుగు హీరోతో పీకల్లోతు ప్రేమలో నయనతార.. ఎంగేజ్మెంట్ వరకు వెళ్లి..?

దాంతో అడివి శేష్ శృతిహాసన్ పై చేయి చేసుకోవడంతో అవమానంగా ఫీల్ అయిన నటి శృతిహాసన్ షూటింగ్ స్పాట్ నుండి ఇంటికి వెళ్లిపోయి నిర్మాత కి ఫోన్ చేసి నేను ఇప్పటినుండి ఆ సినిమా షూటింగ్లో పాల్గొనను. నన్ను మూవీ నుండి తీసేయండి.మీరు నాకు ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తాను అని తేల్చి చెప్పిందట. దాంతో నిర్మాత గాబరా పడిపోయి ఇప్పటికే సగం షూటింగ్ పూర్తి అయింది.

Adivi Sesh who hit heroine during the shooting

ఇప్పుడు మరో హీరోయిన్ అంటే మాకు బడ్జెట్ పెరిగిపోతుంది.అలా చేయకండి ప్లీజ్ అని బతిమిలాడార. కానీ శృతిహాసన్ మాత్రం అడివి శేష్ తనకు క్షమాపణ చెబితేనే షూటింగ్లో పాల్గొంటాను అని బెట్టు చేస్తుందట. మరి సోషల్ మీడియాలో వైరల్ అయ్యే రూమర్ నిజమేనా..నిజంగానే శృతిహాసన్ అడివి శేష్ మధ్య గొడవ జరిగిందా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సిందే అంటున్నారు వీరి అభిమానులు.(Adivi Sesh)