Nagarjuna Joins Rajinikanth in Gangster Drama Coolie

Gangster Drama Coolie: టాలీవుడ్ స్టార్ నాగార్జున, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరో గా నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా కూలీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా పట్ల అంచనాలు ఆకాశాన్ని తాకుతుండటానికి ఇద్దరు దిగ్గజ నటులు తొలిసారిగా తెరపై కలిసి నటించబోతున్న విషయం అందరిని ఆసక్తి పరుస్తుంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా, ఆయన సైమన్ పాత్రలో కనిపిస్తున్న పోస్టర్ విడుదల చేయగా, అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సెప్టెంబర్‌లో జైలర్ సెట్లో నాగార్జున పాల్గొన్న వీడియో కూడా లీక్ అవ్వడంతో, ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఉత్సాహం పెరిగింది.

Nagarjuna Joins Rajinikanth in Gangster Drama Coolie

నాగార్జున పాత్ర గురించి వస్తున్న వార్తల ప్రకారం, ఈ క్రైమ్ డ్రామాలో పవర్ ఫుల్ డాన్ పాత్రలో కనిపించనున్నారు. రజనీకాంత్ పాత్రకు శక్తివంతమైన ప్రతిస్పందనగా ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తోంది. వీరిద్దరి మధ్య జరిగే ఘర్షణ సన్నివేశాలు సినిమాకు హైలైట్ గా నిలుస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇద్దరు సీనియర్ నటుల అనుభవం, నటనా ప్రతిభ ఈ సన్నివేశాల్లో అత్యున్నత స్థాయిలో కనిపిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.

Also Read: Pawan Kalyan: ఓజీ కోసం రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్.. వచ్చే ఏడాది పవన్ ఫాన్స్ కి డబల్ ధమాకా!!

ప్రస్తుతం కూలీ షూటింగ్ చెన్నైలో వేగంగా జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్, శాండల్‌వుడ్ హీరో ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ వంటి ప్రముఖులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారని సమాచారం. సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు లోకేష్ కనకరాజ్ తన ప్రతిభతో మరో సారి ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమయ్యారు.

కూలీ తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. త్వరలోనే సినిమా ప్రమోషన్లు ప్రారంభం అవుతాయని, టీజర్, ట్రైలర్ విడుద తేదీల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.