Shraddha Kapoor in Talks for Nani Next Film

Nani Next Film: నేచురల్ స్టార్ నాని, దసరా సినిమాతో తన కెరీర్‌లోనే అత్యంత పెద్ద విజయాన్ని అందుకున్నారు. శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద సెన్సషనల్ విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు, ఈ విజయవంతమైన కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. నాని, శ్రీకాంత్ కాంబోలో తెరకెక్కనున్న ఈ కొత్త చిత్రానికి ‘NaniOdela2’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవలే హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి.

Shraddha Kapoor in Talks for Nani Next Film

ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం, జాన్వీ కంటే, శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. శ్రద్ధా ఇటీవల ‘స్త్రీ 2’ సినిమాలో నటించి హిందీలో భారీ విజయం సాధించగా, ఆ విజయంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగింది.

Also Read: Samantha: నిర్మాతగా మారుతున్న సమంత.. ఏకంగా అన్ని సినిమాలే ఒకేసారి మొదలు!!

ఈ సినిమాలో శ్రద్ధా నటిస్తే, ఆమెకు ప్రభాస్‌తో నటించిన ‘సాహో’ తర్వాతి రెండవ తెలుగు సినిమా అవుతుంది. చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. సినిమా రాజకీయ నేపథ్యంతో రూపొందనుందని సమాచారం. ‘దసరా’ సినిమాను నిర్మించిన సుధాకర్ చెరుకూరి, ఈ సినిమాని కూడా తన ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

నాని, శ్రీకాంత్ కాంబినేషన్ పై ‘దసరా’ విజయంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా ఉంటే ఈ ప్రాజెక్ట్‌పై మరిం ఆసక్తి పెరిగింది.