Allu Arjun Pushpa 2 to Have Grand Premieres on December 4

Allu Arjun Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న “పుష్ప: ది రూల్” సినిమా పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అత్యంత ప్రతిష్టాత్మక సీక్వెల్ ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది. దర్శకుడు సుకుమార్ మరోసారి ప్రేక్షకుల్ని మెప్పించడానికి సిద్దంగా ఉన్నారు. అల్లు అర్జున్ తన అద్భుతమైన నటనతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజూ ఈ సినిమాకు సంబంధించిన వార్తలు సినీ వర్గాల్లో చర్చకు దారి తీస్తున్నాయి.

Allu Arjun Pushpa 2 to Have Grand Premieres on December 4

మొదట డిసెంబర్ 6 న విడుదల చేస్తామని ప్రకటించిన చిత్ర బృందం, తాజాగా డిసెంబర్ 5నే విడుదల చేయనున్నట్లు తెలిపింది. ముంబైతో పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో ప్రీమియర్ షోలను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకు గ్రాండ్ ప్రీమియర్ షో ప్రదర్శించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ ముందస్తు ప్రీమియర్ల నిర్ణయం, చిత్ర బృందం సినిమాపై ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తోంది.

Also Read: Nani Next Film: నాని సినిమా అంటేనే భయపడిపోతున్న బాలీవుడ్ హీరోయిన్స్!!

“పుష్ప: ది రైజ్” సాధించిన అద్భుత విజయంతో, సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్ర బృందం కూడా ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. అల్లు అర్జున్ పోషిస్తున్న పుష్పరాజ్ పాత్ర ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ కాగా, అతని యాక్షన్, మాస్ లుక్స్ అభిమానులను కట్టిపడేయనున్నాయి.

ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా, ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. “పుష్ప: ది రైజ్”లో అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఆయన, ఈ సినిమాలో కూడా తమ ముద్ర వదిలేలా అద్భుతమైన పాటలు, నేపథ్య సంగీతం అందిస్తారని అభిమానులు ఆశాభావంతో ఉన్నారు.