Sharwa 38: టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్ ప్రస్తుతం “Sharwa38” అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా, 1960ల నాటి ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల కథతో కొనసాగుతుంది. ఆ కాలం రాజకీయ, సామాజిక పరిస్థితుల్ని ప్రతిబింబిస్తూ, అక్కడి ప్రజల జీవితాల్లో చోటుచేసుకున్న సంఘటనలను ఆసక్తికరంగా తెరమీదకు తీసుకురావడానికి కథను మలిచారు.

Massive Set Construction for Sharwa 38

ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల కోసం హైదరాబాద్ సమీపంలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఓ అద్భుతమైన సెట్‌ను నిర్మించారు. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నే నేతృత్వంలో ప్రతిభావంతులైన కళాకారులు ఈ సెట్‌ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. అక్కడి సంస్కృతి, వాతావరణం ప్రతిబింబించేలా సెట్‌ వేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ సెట్‌లోనే కీలక సన్నివేశాలతో పాటుగా కొన్ని పాటల్ని కూడా చిత్రీకరించనున్నారు.

Also Read: Sania Mirza: మాజీ భర్తకు సానియా మీర్జా షాక్.. ఆవ్యక్తితో సానియా రెండో పెళ్లి..?

శర్వానంద్ ఈ సినిమాలో 1960ల యువకుడిగా కనిపించనున్నాడు. పాత్రకు తగ్గట్టు ఆయన శరీరాకృతి, హెయిర్ స్టైల్, దుస్తుల వంటి విషయాల్లో పూర్తిగా మారిపోయారు. పాత్రకు మరింత న్యాయం చేయడానికి ప్రత్యేకంగా వర్క్‌షాప్‌లు కూడా తీసుకున్నారని సమాచారం. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా ద్వారా శర్వానంద్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించనున్నాడు.

శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె. రాధా మోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, అనుభవజ్ఞులై సాంకేతిక నిపుణులు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వంటి ఇతర విభాగాల్లో పని చేస్తున్నారు. ఈ యాక్షన్ డ్రామాలో ప్రేమ, సెంటిమెంట్ వంటి విభిన్న అంశాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని అంచనా.