Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఉన్న అభిమానుల ప్రేమ అంతులేనిది. ఆయన కూడా తన అభిమానులను ఎంతో అపురూపంగా భావిస్తారు, తరచూ వారిని కలుస్తూ, సోషల్ మీడియా ద్వారా వారిని హుషారుపరుస్తారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ నుండి ఒక యువ అభిమాని 1600 కిలోమీటర్ల దూరం సైకిల్ పై ప్రయాణించి, హైదరాబాద్ లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నాడు.

Allu Arjun Interacts with Fan Who Biked 1600 km

ఈ అభిమాని పేరు అజయ్ కుమార్. ఆయన, తన అభిమాన నటుడిని కలవాలనే తపనతో ఈ సాహసానికి ఒడిగట్టాడు. అజయ్ కుమార్ సైకిల్ యాత్ర గురించి తెలుసుకున్న అల్లు అర్జున్, అతని అంకితభావానికి ముగ్ధుడై, ఆ యువకుడిని ఇంటికి ఆహ్వానించి కొంత సమయం గడిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, అల్లు అర్జున్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ, అజయ్ యొక్క సైకిల్ యాత్ర గురించి ఆరా తీశారు. అజయ్, అల్లు అర్జున్ తో మాట్లాడుతూ, ఆయన సాదాసీదా వ్యక్తిత్వం, మంచి మనసు తనను ఎంతో ఆకర్షించాయని తెలిపాడు.

Also Read: Samantha: సమంత స్టామినా.. బాలీవుడ్ లో ప్రశంశల వర్షం!!

తెరపై తన అభిమాన నటుడిని ప్రత్యక్షంగా కలిసే అనుభవం, అజయ్ కి జీవితంలో మరచిపోలేని క్షణమని అంగీకరించాడు. ఈ యాత్ర ప్రారంభానికి ముందు హనుమాన్ చాలీసాను పారాయణం చేసినట్లు వెల్లడించాడు. అల్లు అర్జున్ తో కొద్దిసేపు మాట్లాడటం తన కల నిజమైనట్లు ఉందని పేర్కొన్నాడు. అల్లు అర్జున్ కూడా అజయ్ అంకితభావానికి అభినందనలు తెలిపారు.

అల్లు అర్జున్ ప్రస్తుతం “పుష్ప 2: ద రూల్” సినిమాకు సంబంధించిన షూటింగ్ లో బిజీ గా ఉన్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కానుంది. అభిమానుల ప్రేమ మరియు సపోర్ట్ తనకు ఎంతో ముఖ్యమని అల్లు అర్జున్ తరచూ చెబుతుంటారు. అజయ్ కుమార్ సాహస యాత్ర ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ అభిమానుల పట్ల చూపించే ఆప్యాయతను అందరూ కొనియాడుతున్నారు.