Rana Daggubati Unveils Telugu Trailer of Snakes and Ladders

Snakes and Ladders: “బాహుబలి” ఫేమ్ రానా దగ్గుబాటి తన సోషల్ మీడియా ద్వారా అక్టోబర్ 18న ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న డార్క్ హ్యూమర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ “స్నేక్స్ అండ్ లాడర్స్” తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్తీక్ సుబ్బరాజ్ క్యూరేట్ చేసిన ఈ తమిళ సిరీస్‌ను కళ్యాణ్ సుబ్రమణియన్ (ఎ స్టోన్ బెంచ్ ప్రొడక్షన్) నిర్మించారు. కమలా అల్కెమిస్ మరియు ధీవకర్ కమల్ రూపొందించిన ఈ సిరీస్‌కు అశోక్ వీరప్పన్, భరత్ మురళీధరన్, కమలా అల్కెమిస్ దర్శకత్వం వహించారు.

Rana Daggubati Unveils Telugu Trailer of Snakes and Ladders

తొమ్మిది ఎపిసోడ్లుగా రూపొందించిన ఈ సిరీస్‌లో నవీన్ చంద్ర, నంద, మనోజ్ భారతిరాజా, ముత్తుకుమార్, శ్రీంద, శ్రీజిత్ రవి, సామ్రిత్, సూర్య రాఘవేశ్వర్, సూర్యకుమార్, తరుణ్, సాషా భరెన్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. క్లాసిక్ గేమ్ “స్నేక్స్ అండ్ లాడర్స్” నుంచి ప్రేరణ పొందిన ఈ సిరీస్‌ ఆసక్తికరంగా ఉండబోతుంది. రానా తన సోషల్ మీడియా పోస్ట్‌లో “ప్రతి మెట్టులోనూ ప్రమాదం ఉంది. ఈ వైకుంఠపాళీ ఆట చూడటానికి మీరు సిద్ధమా?” అని ట్రైలర్‌ను షేర్ చేశారు.

Also Read: Tollywood Stars: పేర్ల మార్పులు వీరి కెరీర్ గ్రాఫ్ ను మార్చేనా?

ఉత్కంఠ ను రేకెత్తించే కథాంశం, థ్రిల్లింగ్ సస్పెన్స్‌తో “స్నేక్స్ అండ్ లాడర్స్” అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సిరీస్‌లలో ఒకటిగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. తమిళంలో ప్రైమ్ వీడియో ద్వారా విడుదలవుతున్న తొలి డార్క్ హ్యూమర్ థ్రిల్లర్ ఇది. అక్టోబర్ 18న భారత్ మరియు ప్రపంచవ్యాప్తంగా 240 దేశాలు మరియు ప్రాంతాల్లో ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్ చేసిన వెర్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి.

ఈ సిరీస్ ట్రైలర్‌ను చూసిన ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజ్ మార్క్ డైలాగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, నటీనటుల నటన అన్నీ ట్రైలర్‌లో ఆకట్టుకున్నాయి. డార్క్ హ్యూమర్ థ్రిల్లర్ జానర్‌లో రూపొందించిన ఈ సిరీస్ తెలుగు ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుంది అని ఆశిస్తున్నారు.