Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… గత కొన్ని సంవత్సరాలుగా ఓటుకు నోటు కేసు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు.. 50 లక్షల రూపాయల బ్యాగ్ తో రేవంత్ రెడ్డి.. దొరికిపోయారు. కెసిఆర్ ప్రభుత్వంలోని.. ఓ ఎమ్మెల్సీ ని కొనుగోలు చేసేందుకు రేవంత్ రెడ్డి… 50 లక్షలు ఇస్తుండగా దొరికిపోయాడు. ఈ కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి ఓటుకు నోటు కేసులో… ముద్దయిగా మార్చేశారు. Revanth Reddy

Big Shock To Revanth Reddy vote for note Case

ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఈ కేసు నడుస్తూనే ఉంది.అయినప్పటికీ.. ఇక్కడ పడ్డాడు అక్కడే… నిలబడి చూపించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పట్టుదలతో తెలంగాణ ముఖ్యమంత్రిగా.. బాధ్యతలు తీసుకొని దూసుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి. అయితే అలాంటి రేవంత్ రెడ్డికి ఇప్పుడు కొత్త చిక్కులు వచ్చాయి. ఆయన మెడకు ఈడి కేసు చుట్టుకుంటాంది. Revanth Reddy

Also Read: BJP: తెలంగాణ బీజేపీలో ముసలం… హైదరాబాదులో ఒక్క సీటు గెలవలేదని కొట్లాట?

ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి ప్రత్యక్ష ప్రమేయం ఉందని తాజాగా.. ఈడి అధికారులు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్లు తెలిపారు. వాటిని కోర్టుకు ఇస్తామని తెలిపింది ఈడీ. 50 లక్షలు మనీలాండరింగ్ చేశారని కూడా ఈడీ అధికారులు ఆరోపించడం జరిగింది. వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేసేందుకు ఐదు కోట్ల బేరం కూడా చేసినట్లు ఈడి అధికారుల దగ్గర… సాక్షాలు ఉన్నాయట. దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి.. ఈడి అధికారులకు భయపడాల్సి వస్తోంది. Revanth Reddy