Kadiyam Srihari: తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గులాబీ పార్టీ నేతలు….కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత…ముసలo మొదలైంది. ఎవరైతే గులాబీ నేతలు… కాంగ్రెస్ లోకి వెళ్లారో… అక్కడ పాత కాంగ్రెస్ నేతల నుంచి… పార్టీ మారిన నేతలకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. Kadiyam Srihari

big Shock to Kadiyam Srihari in Congress

ప్రతి ఒక్క చోట ఇదే పరిస్థితి ఉంది. తాజాగా.. టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కడియం శ్రీహరి పరిస్థితి కూడా… ఇదే దాపురించింది. ఆయనను కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి పంపాలని… స్టేషన్ ఘనపూర్ ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇటీవల టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కడియం శ్రీహరి తన అనుచరులకు పెత్తనం ఇస్తున్నారని… ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం జరుగుతోందని వారు నిరసన చేపట్టారు. Kadiyam Srihari

Also Read: BJP: తెలంగాణ బీజేపీలో ముసలం… హైదరాబాదులో ఒక్క సీటు గెలవలేదని కొట్లాట?

స్టేషన్ ఘనపూర్ స్థానిక కాంగ్రెస్ నేత సింగపూర్ ఇందిరా కు కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొన్నటి వరకు తమపై కేసులు పెట్టిన కడియం శ్రీహరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడం దారుణం అన్నారు. వెంటనే కడియం శ్రీహరిని పార్టీ నుంచి బయటికి పంపాలని… ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకే అసలు సీసలు పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కడియం శ్రీహరికి ఇప్పుడు… గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. Kadiyam Srihari