50 days for Pushpa 2: The Rule release

Pushpa 2: The Rule: ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం “పుష్ప 2: ది రూల్”. ఈ సినిమా భారతీయ సినీ పరిశ్రమలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా భారీ అంచనాలను సొంతం చేసుకుంది. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇంతటి గుర్తింపును తెచ్చుకోవడం మనందరికీ గర్వకారణం. డిసెంబర్ 6న పుష్పరాజ్ తిరిగి వచ్చి తన “రూల్”ను ప్రారంభించనున్నాడు. సినిమా విడుదలకు 50 రోజులే ఉన్న సందర్భంగా విడుదలైన పోస్టర్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సింహాసనంపై కూర్చుని, పుష్పరాజ్‌గా రారాజులా కనిపిస్తున్నాడు. మేకర్స్ ఈ సినిమా ద్వారా భారతీయ చిత్రసీమలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేవబోతోందని సూచించారు.

50 days for Pushpa 2: The Rule release

“పుష్ప: ది రైజ్” సినిమా ముగిసిన చోట నుంచి కథ కొనసాగుతుంది. పుష్పరాజ్, శ్రీవల్లి, భన్వర్ సింగ్ శేఖావత్ మధ్య జరిగే సంఘర్షణ ఏ స్థాయికి చేరుకుంటుందన్నది ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. పుష్పరాజ్ తన శత్రువులను ఎలా ఎదుర్కొంటాడు? శ్రీవల్లి పాత్ర ఈ సీక్వెల్‌లో ఎలా ఉంటుంది? భన్వర్ సింగ్ శేఖావత్ పుష్పరాజ్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు? ఇలాంటి ప్రశ్నలకు ఈ సినిమాలో సమాధానాలు దొరకనున్నాయి.

Also Read: Hero: స్టార్ హీరోయిన్ తో హోటల్ రూమ్ లో అడ్డంగా బుక్ అయిన హీరో.?

పుష్ప 2లో ప్రతి సీన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని, సినిమా చూసిన వారందరూ ఫిదా అవుతారని మేకర్స్ ధీమాగా చెబుతున్నారు. “పుష్ప: ది రైజ్” తో అద్వితీయమైన నటనతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, పుష్ప-2లో మరింత ప్రభావవంతమైన పాత్రలో కనిపించనున్నాడు. దర్శకుడు సుకుమార్ టేకింగ్, మేకింగ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నవీన్ ఏర్నేని, వై రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు, టీజర్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెక్నికల్‌గా పుష్ప 2 అత్యున్నత స్థాయిలో ఉండబోతుంది.