Radhika Apte: ప్రముఖ నటి రాధికా ఆప్టే తల్లి కాబోతున్నారని తెలిసి సినీ ప్రపంచం ఆనందంలో మునిగిపోయింది. పెళ్లయి 12 ఏళ్ల తర్వాత గర్భవతి కావడం అభిమానులనే కాకుండా సినీ ప్రముఖులను సైతం సంతోషానికి గురిచేసింది. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో నల్లని గౌనులో మెరిసిన రాధికా, బేబీ బంప్ తో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు ఆమెపై ప్రేమాభిమానాలను వ్యక్తం చేస్తూ, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Radhika Apte Announces Pregnancy After 12 Years of Marriage
2012లో బ్రిటిష్ సంగీతకారుడు బెనెడిక్ట్ టేలర్ ను వివాహం చేసుకున్న రాధికా, తన నటనా ప్రతిభతో తెలుగు, హిందీ, మరాఠీ, తమిళ, బెంగాలీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. “పార్చ్డ్”, “ఫోబియా”, “అంధాధున్”, “పద్మావత్” వంటి చిత్రాల్లో ఆమె అద్భుతమైన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. వెబ్ సిరీస్ లలో కూడా, “సేక్రెడ్ గేమ్స్”, “ఘౌల్”, “ఓకే కంప్యూటర్” వంటి ప్రాజెక్ట్‌లతో ఆమెకు విశేష గుర్తింపు వచ్చింది.
Also Read: Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి మండిపడ్డ సమంత!!
కేవలం నటనతోనే కాదు, రాధికా సమాజంలోని అనేక సమస్యలను ధైర్యంగా ప్రశ్నించే వ్యక్తిత్వంతో కూడిన నటి. స్త్రీలపట్ల వివక్ష, లింగ సమానత్వం వంటి అంశాలపై ఆమె నిర్భయంగా స్పందిస్తుంటారు. ఆమె ధైర్యం, నైతికత, స్పష్టత అనేక మందికి స్ఫూర్తిని అందిస్తాయి.
ఇలాంటి సమయంలో తల్లి కాబోతున్న రాధికా వార్త ఆమె అభిమానులకు అత్యంత ఆనందకరంగా మారింది. ఈ కొత్త అధ్యాయం ఆమె జీవితంలో విశేషమైనది అవుతుందని, రాధికా, ఆమె భర్త బెనెడిక్ట్ టేలర్ కు మనస్పూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు ప్రతిఒక్కరు.