Aadhiparvam Movie Set for Global Release on October 31

Aadhiparvam: ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానున్న “ఆదిపర్వం” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏఐ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. మంచు లక్ష్మి, ఎస్తేర్, శివ కంఠమనేని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాలో ఆదిత్య ఓం కీలక పాత్ర పోషిస్తున్నారు.

Aadhiparvam Movie Set for Global Release on October 31

ఎర్రగుడి నేపథ్యంలో అమ్మవారి చుట్టూ అల్లుకున్న ఈ పీరియాడిక్ ప్రేమకథలో గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. 1974-90 మధ్య కాలంలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారని దర్శకుడు సంజీవ్ మేగోటి తెలిపారు. “అమ్మోరు”, “అరుంధతి” చిత్రాల తరహాలో దుష్టశక్తికి, దైవశక్తికి మధ్య జరిగే పోరాటాన్ని ఆసక్తికరంగా చిత్రీకరించారని, అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో ఈ చిత్రాన్ని నిర్మించామంటూ ఆయన చెప్పారు.

Also Read : Sukumar and Allu Arjun: ఆర్య సినిమా కోసం సుకుమార్ ముందుగా బన్నీ ని అనుకోలేదట!!

ఈ చిత్రంలో మంచు లక్ష్మి, ఆదిత్య ఓం, ఎస్తేర్, శివ కంఠమనేని తో పాటు సుహాసిని, శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి, హ్యారీ జోష్, జబర్దస్త్ గడ్డం నవీన్, యోగి ఖత్రి, మధు నంబియార్, బీఎన్ శర్మ తదితరులు నటించారు.

ఎస్ ఎన్ హరీష్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రానికి మాధవి సైబ, ఓపెన్ బనాన ప్రవీణ్, సంజీవ్, బి. సుల్తాన్ వలి, లుబెక్ లీ, రామ్ సుధీ (సుధీంద్ర) సంగీతం అందించారు. పవన్ శేఖర్ పసుపులేటి ఎడిటింగ్ చేయగా, నటరాజ్ ఫైట్స్ కంపోజ్ చేశారు. “ఆదిపర్వం” సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని మూవీ మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.