Jr.NTR: నందమూరి ఫ్యామిలీ మొత్తం జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ లను దూరం పెట్టింది అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నో విషయాల్లో కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లను పక్కన పెట్టిన సన్నివేశాలు మనం ఇప్పటికే చూసాం. తారకరత్న చనిపోయిన సమయంలో కూడా బాలకృష్ణ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పట్టించుకోలేదు.
Jr.NTR reacted for the first time on the querrels with Balakrishna
అయితే జూనియర్ ఎన్టీఆర్ కి సపోర్ట్ గా ఉండడం వల్ల కళ్యాణ్ రామ్ ని కూడా బాలకృష్ణ పట్టించుకోవడం లేదట.ఇక ఓ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తన బాబాయ్ బాలయ్య తో ఉన్న గొడవల గురించి మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా అందరూ చూసే ఉంటారు.(Jr.NTR)
Also Read: Samantha: విడాకులు తీసుకున్న సమంత ని ప్రేమిస్తున్న బాలీవుడ్ హీరో.?
అయితే ఈ సినిమా ప్రమోషన్ సమయంలో ఇందులో నటించిన నటుడు జగపతిబాబు అసలు మీ బాబాయ్ బాలకృష్ణ తో మీకేంటి గొడవలు అని అడిగారు. అయితే ఈ ప్రశ్నకు సమాధానం దాటవేస్తారని అందరూ అనుకున్నారు.కానీ ఎన్టీఆర్ మాత్రం చాలా ఓపెన్ గా మాట్లాడారు.నాకెందుకు ఆయనతో గొడవలు ఉంటాయి.. ఆయన మా నాన్న తమ్ముడు నాకు తండ్రి లాంటివారు. ఆయనతో నాకు ఎప్పుడు ఎలాంటి గొడవలు లేవు.
ఒకవేళ గొడవలు ఉన్నా నేను వాటిని మనసులో పెట్టుకోను. నేను ఏదైనా ఓపెన్ గా మాట్లాడుతాను గాని మనసులో పెట్టుకోను అంటూ జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ బాలకృష్ణ తో ఉన్న గొడవలపై నోరు విప్పారు. అయితే అప్పటి వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారడంతో అసలు వీరిద్దరి మధ్య లాంటి గొడవలు లేనప్పుడు బాలయ్య ఎందుకు ఎన్టీఆర్ ని పక్కన పెట్టారు అని చాలామంది నందమూరి అభిమానులు మాట్లాడుకుంటున్నారు.(Jr.NTR)