Nagarjuna gave a warning to Ali

Nagarjuna: నాగార్జున తన సినీ కెరియర్ లో ఎంతోమంది కొత్త దర్శకులను,నిర్మాతలను, క్యారెక్టర్ ఆర్టిస్టులను, హీరోయిన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనుడు. అలాంటి ఈయన సినిమాల ద్వారా ఎంతో మంది బాలీవుడ్ హీరోయిన్లు సైతం ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇక ఆయన తనతో నటించే ప్రతి ఒక్క హీరోయిన్ తో చాలా సన్నిహితంగా ఉంటారు అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అయితే అలాంటి నాగార్జున ఓ బాలీవుడ్ హీరోయిన్ తో షూటింగ్ చేసే సమయంలో కమెడియన్ అలీ ఆమెను కాస్త కించపరుస్తూ ఆమెపై జోక్ వేశాడట.

Nagarjuna gave a warning to Ali

ఇక ఆయన మాటలకు చిర్రెత్తుకుపోయిన నాగార్జున అందరి ముందే ఆలీకి వార్నింగ్ ఇచ్చారట. మరి ఇంతకీ నాగార్జున ఏ హీరోయిన్ కి సపోర్ట్ గా ఆలీకి వార్నింగ్ ఇచ్చారు అనేది ఇప్పుడు చూద్దాం.. నాగార్జున, ఆయేషా టాకీయా, సోను సూద్,అనుష్క కాంబినేషన్లో పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ సినిమా అందరూ చూసే ఉంటారు. ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో అనుష్క వస్తుంది. (Nagarjuna)

Also Read: Jr.NTR: బాలకృష్ణతో గొడవపై మొదటిసారి స్పందించిన Jr.ఎన్టీఆర్.. ఆయనతో నాకేంటి సంబంధం అంటూ.?

అలాగే బాలీవుడ్ నటి ఆయేషా టాకియా ఈ మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. అయితే ఈ సినిమాలో నటించిన ఆయేషా నవ్వుకి ఫిదా అయిపోయిన నాగార్జున ఆమెను చూస్తూ ఉండిపోయేవారట. ఇక ఆయేషా నవ్వేటప్పుడు ఆమె ముక్కు కాస్త వెరైటీగా ఉండేదట. ఇక అది చూసినప్పుడల్లా నాగార్జునకు తెగ నవ్వొచ్చేదట.

Nagarjuna gave a warning to Ali

ఇక ఈ సినిమాలో నటించిన అలీ కూడా ఆమె నవ్వు చూసి ఓసారి మీరు నవ్వినప్పుడు ఏంటి మీ ముక్కు అలా అవుతుంది అంటూ కామెంట్ చేశాడట.అయితే అయేషా అలీ మాటలకు సీరియస్ అవ్వకుండా కాస్త గిల్టీగా ఫీల్ అయింది. ఇక అలీ ప్రవర్తన చూసిన నాగార్జున ఆలీని పక్కకు తీసుకువెళ్లి ఇంకొకసారి ఆమెపై ఎలాంటి కామెంట్లు చేయకు ఆమె నా సొంతం అన్నట్లుగా మాట్లాడారట. ఇక ఈయన మాటలకి అలీ సైతం షాక్ అయ్యారట.(Nagarjuna)